Viral Video: జనవరికి సరికొత్త స్పెల్లింగ్ చెప్పిన టీచర్, విద్యార్థులు..వీడియో వైరల్..!
Viral Video: ఓ స్కూల్ టీచర్, విద్యార్థులు, న్యూస్ రిపోర్టర్ మధ్య జరిగిన సంభాషణ నవ్వును తెప్పిస్తోంది. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.
Viral Video: ఓ స్కూల్ టీచర్, న్యూస్ రిపోర్టర్ మధ్య ఉల్లాసమైన సంభాషణ జరిగింది. స్కూల్ పిల్లలతో ఉన్న ఆమెను రిపోర్టర్ ప్రశ్నకు సంధించాడు. అదేదో క్లిష్టమైన విషయం కాదండి..ఇంగ్లీష్ టెస్ట్ కోసం ఓ ప్రశ్న వేశాడు. దీనికి ఆ టీచర్, పిల్లల నుంచి వచ్చిన సమాధానం అందర్నీ నవ్విస్తోంది. జనవరి నెలకు స్పెల్లింగ్ చెప్పాలంటూ ఆమెను అడిగాడు. దీంతో ఆందోళనకు గురైన టీచర్ ఆ ప్రశ్నను విద్యార్థులను అడగాలని చెప్పింది.
దీంతో ఆ రిపోర్టర్..జనవరి స్పెల్లింగ్ చెప్పాలంటూ విద్యార్థినిని అడిగాడు. దీనికి ఆ విద్యార్థిని సమాధానం చెబుతూ జే-ఏ-యూ-ఎన్-డీ-ఏవై అని పలుకుతూ జాన్వారి అని ఉచ్ఛరించింది. దీంతో ఆ రిపోర్టర్ ఖంగుతిన్నాడు. ఆ వెంటనే అదే ప్రశ్నను టీచర్‌కు వేశాడు. దీంతో ఆమె హన్‌తో సునియేనా అని చెప్పింది. జనవరి స్పెల్లింగ్‌కు జాన్వారి అంటూ సమాధానం ఇచ్చింది. ఆమె రూరల్ ప్రాంతంలో హిందీ మీడియంలో టీచింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమెకు ఇంగ్లీష్‌లో పరిజ్ఞానం లేనట్లు కనిపిస్తోంది.
ఈవీడియోను సఖ్తాలాగ్ అనే నెటిజన్ ఈవీడియోను పోస్ట్ చేశాడు. దీనికి పదాయి రి బోట్ భయాంకర్ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఈవీడియోను పదివేల మందికి పైగా చూశారు. ఐదు వందల లైక్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టీచర్లు, విద్యార్థులకు దండాలు అంటూ కామెంట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈవీడియో ట్రెడింగ్‌లో ఉంది.
Also read:CM Jagan: సెప్టెంబర్ 1 నుంచి కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ టూర్..!
Also read:CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు..31న బీహార్‌కు గులాబీ నేత..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి