CM Jagan: సెప్టెంబర్ ఒకటి నుంచి 3 తేదీ వరకు వైఎస్‌ఆర్ కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరానికి వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. సాయంత్రం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. సెప్టెంబర్ 2న ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయం గెస్ట్ హౌస్ నుంచి వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి 9.40 గంటలకు వరకు అక్కడే ఉంటారు.
వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంత్రి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి వైఎస్ఆర్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. ఎస్టేట్‌లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈసందర్భంగా వివిధ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సాయంత్రం వరకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.
సెప్టెంబర్ 3న ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరుతారు. 10.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం నుంచి పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడింది. దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి క్లారిటీ ఇచ్చింది. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కడప జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రత రిత్యా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
సీఎం టూర్ ఏర్పాట్లను జిల్లా మంత్రి, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కడప జిల్లాకు సీఎం జగన్ రానున్న నేపథ్యంలో జిల్లా ప్రగతిపై అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. ఆయనకు అధికారులు స్వయంగా అందజేయనున్నారు.
Also read:IND vs PAK: కఠినమైన పరిస్థితుల్లో సంయమనంతో ఆడారు..టీమిండియా ఆటగాళ్లపై గంగూలీ ప్రశంసలు..!
Also read:IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్ వల్ల క్రికెట్‌కు బ్యాడ్ డే..షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి