Viral Video Today: అందరి ముందు పరువు పోయిందిగా.. విద్యార్థి వీపు విమానం మోత.. వైరల్ వీడియో
Teachers Day Special Video: టీచర్స్ డే స్పెషల్ అంటూ నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్వీట్టర్లో, వాట్సాప్‌లో స్టాటస్ పెట్టి తమ టీచర్లను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే..
Teachers Day Special Video: విద్యార్థులతో టీచర్లు ఎంతో సరదాగా ఉంటారు. అయితే వాళ్లకు కోపం తెప్పించే పనులు చేస్తే మాత్రం కచ్చితంగా చేతికి పని చెబుతారు. అప్పుడు విద్యార్థులు వీపు విమానం మోత మోగాల్సిందే. నేడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించి.. తమ విజయంలో కీలక పాత్ర పోషించిన గురువులను గుర్తు చేసుకుంటున్నారు. కొందరు విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు గిఫ్ట్స్, పూలతో తమ ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తున్నారు. కాగా.. ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు వీపు చింతపండు అయ్యేలా కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. టీచర్స్ డే సందర్భంగా పాత వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అసలైన టీచర్స్ డే అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. మీకు కూడా కచ్చితంగా నవ్వుకుంటారు. మీలో కూడా చాలా మంది ఉపాధ్యాయుల చేతిలో ఇలా దెబ్బలు తినే ఉంటారు. వీడియోను చూస్తుంటే.. పాఠశాలలో పుట్టినరోజు వేడుకగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఒక ఉపాధ్యాయుడితో విద్యార్థి సరదాగా పరిహాసం చేసేందుకు ప్రయత్నించాడు. క్లాస్ రూమ్ చుట్టూ ఫోమ్ స్ప్రే చేశాడు. విద్యార్థులు చప్పట్లతో కేకలు వేస్తుననారు. ఉపాధ్యాయుడి మీదకు కూడా స్ప్రే చేశాడు.
అప్పటివరకు శాంతంగా ఉన్న ఆ ఉపాధ్యాయుడికి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. విద్యార్థిని కాలర్ పట్టుకుని.. టేబుల్‌పైకి లాక్కొని వీపుపై మూడు నాలుగు దెబ్బలు వేశాడు. విద్యార్థిపై ఉపాధ్యాయుడు చేయి చేసుకున్నా.. హాస్యభరితంగా కనిపిస్తోంది. ఈ వీడియోను షేర్ చేసుకుంటు నెటిజన్లు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. కొందరు అయితే తమను ఇంతకంటే ఎక్కువగానే దెబ్బలు పడ్డాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసి సరదాగా నవ్వుకోండి. మీకు ఇలాంటి సంఘటన జరిగి ఉంటే.. మీ టీచర్లు, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి.
Also Read: India World Cup 2023 Squad: సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన
Also Read: RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook