Viral video: ఎదురుగా దూసుకొస్తున్న రైలు-ట్రాక్‌పై ఏనుగు-చివరకు ఏం జరిగిందో చూడండి
Elephant viral video: ఎదురుగా రైలు దూసుకొస్తోంది.. అదే రైల్వే ట్రాక్‌పై ఓ ఏనుగు అడ్డుగా నిలుచుంది... రైలు తనను సమీపిస్తున్నా ఏనుగు అక్కడి నుంచి పక్కకు జరగలేదు... చివరకు ఏం జరిగిందంటే...
Elephant viral video: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం లెక్కలేనన్ని వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు (Viral videos) క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఏనుగు, నెమలికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ రెండు రైల్వే ట్రాక్‌పై ఉన్న సమయంలో... ఎదురుగా రైలు దూసుకొచ్చింది. రైలు దగ్గరికి రాగానే నెమలి పక్కకు ఎగిరిపోగా... ఏనుగు మాత్రం ట్రాక్ నుంచి తప్పుకోలేదు. చివరకు రైలు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో ఆ ఏనుగుకు ప్రమాదం తప్పింది.
పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) మల్బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ అక్కడి వన్యప్రాణులకు (Wild animals)ఒక డెత్ ట్రాప్‌లా మారింది. రైళ్లు ఢీకొని తరచూ వన్య ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఉన్న ఏనుగుది అదృష్టమనే చెప్పాలి. రైలు ఎదురుగా దూసుకొస్తున్నప్పటికీ అది రైల్వే ట్రాక్ పైనే ఉండిపోయింది. అదే ట్రాక్‌పై ఉన్న ఓ నెమలి మాత్రం రైలు దగ్గరికి రాగానే ఒక్కసారిగా పక్కకు ఎగిరిపోయింది. ఏనుగు ట్రాక్ పైనుంచి కదలకపోవడంతో డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. రైలు పూర్తిగా స్లో అయ్యాక గానీ ఆ ఏనుగు ట్రాక్ నుంచి తప్పుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా రైలు వెళ్లే స్పీడ్‌లో అన్నిసార్లు ఎమర్జెన్సీ బ్రేక్ సాధ్యం కాదు. ప్యాసింజర్ రైలు అయితే ఎమర్జెన్సీ బ్రేక్‌తో రిస్క్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు బోగీలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే రైలు ఎదురుగా ఎవరైనా నిలబడినా... వారిని ఢీకొట్టి వెళ్లడమే తప్ప రైలును ఆపే పరిస్థితి ఉండదు. కానీ ఈ వీడియోలో (Viral video) కనిపిస్తున్న డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఏనుగును కాపాడటంతో అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: గ్యాంగ్ రేప్... 1000 మంది పోలీసుల ఉరుకులు, పరుగులు... చివరికి షాకింగ్ ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook