తాబేలు అనగానే గుర్తొచ్చేది దాని నెమ్మది స్వభావం. దేనిని నొప్పించకుండా దాని పని అది చేసుకుంటుందనే భావన కలుగుతుంది. కానీ మీరు ఈ ఘటన గురించి తెలుసుకుంటే వామ్మో తాబేలు కూడా వేటాడుతుందా అని షాక్ గురవుతారు. ఓ తాబేలు చాకచక్యంగా దాడిచేసి సెకన్ల వ్యవధిలో ఓ పావురాన్ని నోటకరుచుకుని (Turtle kills pigeon) నీళ్లలోకి లాక్కెళ్లింది. ఈ 10 సెకన్ల వైరల్ వీడియో చూసిన నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారుGangavva Funny Comments: అరియానాపై గంగవ్వ జోక్స్.. పగలబడి నవ్విన సభ్యులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా తాబేలు ఏంటి.. ఇలా వేటగాడిగా మారి వేరే జంతువును చంపడం (Tortoise kills pigeon) ఏంటనిపించినా ఇది నిజం. నీటి మడుగు పక్కన కొన్ని పావురాలు తిరుగుతున్నాయి. తాబేలు బాబాయ్‌తో మనకేంటి సమస్య అనుకుని హాయిగా తిరుగుతున్న పావురం ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. 1.8 మిలియన్ల మంది వీడియోను వీక్షించారు. తాబేలు వేటాడే వీడియో వైరల్‌గా మారింది. Moosapet Metro Station: మెట్రో గోడలకు పగుళ్లు.. హైదరాబాద్ మెట్రో సురక్షితమేనా? 



కొందరేమో నా జీవితంలో అత్యంత వేగంగా కదిలిన తాబేలు ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో దారుణంగా స్పందిస్తున్నారు. ఒక్క పావురమే చనిపోయింది.. ఇంకా చాలా ఉన్నాయిగా అంటూ దారుణమైన కామెంట్లతో స్పందిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనే దానిపై స్పష్టత లేకున్నా.. తాబేలు దాడిచేసి పావురాన్ని చంపేయడంపై నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. Telangana: 1000 దాటిన కరోనా మరణాలు



ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR