Gangavva Funny Comments: మళ్లీ అరియానా గాలి తీసేసిన గంగవ్వ.. పగలబడి నవ్విన కంటెస్టెంట్స్

బిగ్ బాస్ 4 హౌస్‌లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ (Bigg Boss Telugu 4 Contestant Gangavva) జోకులకు ఇంటి సభ్యులు పదోరోజు పగలబడి నవ్వారు. అరియానా గ్లోరి ఫేస్ రీడింగ్ టాస్కు మీద గంగవ్వ జోకులు వేసి నవ్వులు పూయించారు.

Last Updated : Sep 17, 2020, 01:21 PM IST
  • Bigg Boss Telugu 4 ఎంజాయ్ మెంట్ తారాస్థాయికి చేరింది
  • అరియానా గ్లోరికి బిగ్ బాస్ Face Reader టాస్క్
  • గంగవ్వ జోకులకు ఇంటి సభ్యులు పగలబడి నవ్వారు
Gangavva Funny Comments: మళ్లీ అరియానా గాలి తీసేసిన గంగవ్వ.. పగలబడి నవ్విన కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ (Bigg Boss Telugu 4 ) ఎంజాయ్ మెంట్ తారాస్థాయికి చేరింది. రెండో వారం నామినేషన్‌ తర్వాత నామినేట్ అయిన బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ ఏ ఎలిమినేషన్ బెరుకు లేకుండా ఎంటర్ టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 4 హౌస్‌లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ (Bigg Boss Telugu 4 Contestant Gangavva) జోకులకు ఇంటి సభ్యులు పదోరోజు పగలబడి నవ్వారు. గంగవ్వ కోసం అప్పుడే ఆర్మీ సిద్ధమైంది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగాలని భావిస్తూ భారీగా ఓట్లు వేస్తున్నారు. Moosapet Metro Station: మెట్రో గోడలకు పగుళ్లు.. హైదరాబాద్ మెట్రో సురక్షితమేనా? 

బిగ్ బాస్ 4 11వ ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్ అరియానా గ్లోరికి బిగ్ బాస్ ఓ టాస్క్ (Face Reader Task) ఇచ్చారు. ఇంటి సభ్యుల గురించి తాను ఏమనుకుంటుందో కచ్చితంగా చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. ఆపై (Ariyana Glory Face Reading Task) టాస్కు చేయడానికి వస్తూనే ఎక్స్‌ట్రా చేసింది. తాగి ఇలా వచ్చిందని అమ్మ రాజశేఖర్ కామెంట్ చేశారు. తొలుత అఖిల్ గురించి చెప్పింది. కంటెస్టెంట్ అఖిల్ షోకు రాకముందు ఎమోషనల్ ప్రెషర్ ఉందని చెప్పింది. బాధ్యతకు సంబంధించిన ఏదో బంధం అని.. ఎమోషనల్ విషయాలను దాచిపెడతాడని అరియానా గ్లోరి ఫేస్ రీడింగ్ చెబుతోంది. Bigg Boss Telugu 4: ‘నా ఫిగర్‌ను కూడా వదల్లేదు.. దమ్ముంటే ఆమెతో ట్రై చెయ్’

అమ్మ రాజశేఖర్ చాలా మంచి వ్యక్తి అని, మేం చూస్తున్నదానికంటే చాలా మానవత్వం గల వ్యక్తి.. ఇలాగే కొనసాగాలని అరియానా కోరింది. ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ కుమార్ గురించి చెప్పింది. కుమార్ ఏదో ప్లాన్‌తో హౌస్‌లోకి వచ్చాడని, అందర్నీ చూశాక ప్లాన్ మారిందని అరియానా అంటోంది. అయితే ఆయన అనుకున్న ఫస్ట్ ప్లాన్ వర్క్ అవ్వదని, ప్రస్తుతం మార్చిన ప్లాన్ జరిగే అవకాశం లేదని అరియానా తనకు తోచింది చెబుతోంది. వెంటనే గంగవ్వ అందుకుని.. ఇది ఏదో జాతకాలు, పంచాంగం చెబుతుందని అరియానాపై స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ జోక్ పేల్చారు. ఏం లేదు.. ఇది అంతా తుస్ అని గంగవ్వ తన మార్కు కామెంట్ చేశారు. Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

గంగవ్వ కామెంట్లను తోటి ఇంటి సభ్యులు అమ్మ రాజశేఖర్, అభిజిత్, కరాటే కళ్యాణి బాగా ఎంజాయ్ చేశారు. అమ్మ రాజశేఖర్, కళ్యాణి అయితే పగలబడి నవ్వుకున్నారు. రోజురోజుకూ బిగ్ బాస్ 4 హౌస్‌లో గంగవ్వ తనదైన సహజమైన మార్కు పంచులు, కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు.    

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News