Man puts snake in his lungi: పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. అందులోనూ ఆరు అడగులు పామును చూశారంటే ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. కానీ ఇక్కడ ఇదిగో ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తికి మాత్రం పాములు పట్టడం అంటే ఓ సరదా.. అలాంటిలాంటి సరదా కాదు.. ఆరు అడుగుల పామునైనా పాము పిల్లను పట్టుకున్నట్టు పట్టుకుని ఓ ఆటాడిస్తాడు. అంతటితో అయిపోలేదండోయ్. ఆ పామును పట్టుకుని ఎక్కడో కాదు తన లుంగీలోనే బంధించుకుని ఏమీ ఎరుగనట్టే వెళ్లిపోయాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ఇదిగో ఈ వీడియో చూడండి మీరు నమ్మడమే కాదు.. వీడెవడండీ బాబూ అని ముక్కున వేలేసుకోవడం ఖాయం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Nayanthara Trolls: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నయనతారపై నెటిజన్ల ట్రోలింగ్, అసలు విషయం ఏంటంటే


తమిళనాడులో జరిగినట్టుగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద (IFS Susanta Nanda) ట్విటర్‌లో షేర్ చేసుకోగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. లుంగీతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయంటూ సుశాంత నంద తన ట్వీట్‌లో పేర్కొనగా.. నెటిజెన్స్ ఈ వీడియో షేర్ చేసుకుంటూ తమదైన స్టైల్లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook