Viral Video Of the Day: ఏనుగు ( Elephant ) కొండంత ఉంటుంది. అలా అని అది మిగితా జీవులకు ఇబ్బంది కలిగించదు. అయితే కొన్ని సార్లు తన పనికి ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే కొన్ని సార్లు ఏనుగు కన్నా చిన్న జీవులు కూడా ఏనుగుకు చుక్కలు చూపిస్తాయి. అచ్చం ఈ బాతు ( Elephant Vs Duck ) లాగే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ( Social Media ) లో చక్కర్లు కొడుతోంది. Also Read :Funny Video: అడవిలో పార్టీ..కేకు ఎత్తికెళ్లిన కోతి
When the duck had an elephantine guts👍 pic.twitter.com/TOYbv1LxsM
— Susanta Nanda IFS (@susantananda3) July 10, 2020
వైరల్ వీడియోలో ఏనుగు ఒక చిన్న నీటి సరస్సు ( Pond ) దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి.. ఎదురుగా నీటిలో ఉన్న చిన్న బాతుపై తన తొండంతో నీళ్లు చల్లుతుంది. దీంతో బాతుకు కోపం వస్తుంది. దీంతో అది వెంటనే ఏనుగుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే ఏనుగుపై ఎక్కి చెవిపై దాడి చేస్తుంది. తరువాత నేలపై దిగి ఎగిరి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఏనుగు కూడా దాడి నుంచి తప్పించుకోలేక.. ఎదురుదాడికి ( Elephant Attack ) దిగుతుంది. బాతును నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే దానిపై దాడి చేస్తుంది. ఈ వీడియో మొత్తం చూసిన నెటిజన్స్ చిన్న బాతు పెద్ద ఏనుగుకు చుక్కలు చూపించింది అని కామెంట్ చేస్తున్నారు.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Also Read: Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు