Boyfriend Love Propose Video: లవ్ ప్రపోజ్ చేయడమెలా..  ఎలా ప్రపోజ్ చేస్తే ఇంప్రెస్ చేయొచ్చు.. దీనికి సమాధానాలు బోలెడు ఉండొచ్చు. సినిమాల్లోనైతే లవ్ ప్రపోజ్ సీన్స్ ఎన్నో చూసుంటాం. నిజ జీవితంలో తాజాగా ఓ యువకుడు తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారథాన్ రన్నింగ్ పోటీలో పాల్గొన్న తన ప్రేయసి.. సరిగ్గా గెలుపు గీతను దాటే వేళ ఆ యువకుడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది ఆ యువతి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ లవ్ ప్రపోజ్ సీన్ చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూయార్క్‌లో ఇటీవల 'బఫెలో మారథాన్' నిర్వహించారు. ఇందులో మాడిసన్ అనే యువ రన్నర్ పాల్గొన్నది. అందరినీ వెనక్కి నెట్టి మారథాన్‌ రన్‌లో ఆమె దూసుకెళ్లింది. మాడిసన్ గెలుపు గీతను చేరే సమయానికి.. అక్కడ ఆమె కోసం ప్రియుడు క్రిస్టఫర్ జేమ్స్ ఎదురుచూస్తూ కనిపించాడు. ఆమె గీత దాటడమే ఆలస్యం.. మోకాలిపై కూర్చొని ఆమెకు ప్రపోజ్ చేశాడు. నవ్వుతూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగాడు.


సంతోషం పట్టలేక ఆమె అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అక్కడున్నవారంతా ఈ జంటను చూసి కేరింతలు పెట్టారు. ప్రియుడి ప్రపోజ్‌పై స్పందించిన మాడిసన్.. తన గెలుపు వెనుక క్రిస్టఫర్ ఉన్నాడని చెప్పుకొచ్చింది. క్రిస్టఫర్ తనకు వెన్నెముక లాంటివాడని.. అతను లేకపోయి ఉంటే తాను రన్నర్‌గా నిలబడకపోయేదాన్ని అన్ని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'గుడ్ న్యూస్..మూవ్‌మెంట్' అనే ఇన్‌స్టా ఖాతా ద్వారా అప్‌లోడ్ అయిన ఈ వీడియోని ఇప్పటికే 3 మిలియన్ల మంది వీక్షించారు. క్రిస్టఫర్ జేమ్స్ లవ్ ప్రపోజల్ నెటిజన్లను ఫిదా చేస్తోంది.




 

Puri Warns to Bandla Ganesh: చీప్‌గా వాగొద్దు.. నాలుక కొరికేసుకోవడం మంచిదన్న పూరి!


Also Read: Horoscope July 2022: జూలైలో మేష రాశి వారి జాతకం.. వాటికి దూరంగా ఉండాలి.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎదురయ్యే ఫలితాలివే..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.