Aries Horoscope July 2022: వచ్చే జూలై నెలలో మేష రాశి వారికి ఆఫీసులో అనుకూల వాతావరణం ఏర్పడుతంది. ఇదివరకు ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది. అంతేకాదు, ఏ పని చేపట్టినా, ఏ సమావేశంలో పాల్గొన్నా సత్ఫలితాలు సాధిస్తారు. అయితే కొత్త బాధ్యతలు తోడవుతాయి. ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన రావొచ్చు. అయితే ఓపికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి బాగుంటుంది. వచ్చే నెలల మేష రాశి వారికి కుటుంబపరంగా, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయి
వ్యాపారస్తులు ఈ నెలలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి. ఏ పని చేసినా పూర్తి అంకితభావంతో చేయాలి. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ ఈ సవాళ్ల కారణంగా, వ్యాపారాన్ని వదిలేయాలనే ఆలోచనకు రావొద్దు. చేసే పనిని మనసు పెట్టి చేస్తే మంచి ఫలితం ఉంటుందని గుర్తుంచుకోండి. అప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.
బెట్టింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉండండి, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శారీరక వ్యాయామంపై దృష్టి పెట్టాలి. జిమ్‌లో వర్కౌట్స్ చేయండి. స్నేహితుల కారణంగా నెలలో 15 రోజులు వృథా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి స్నేహాలకు దూరం జరగండి. అర్థవంతమైన పనులకు సమయాన్ని వెచ్చించండి. నిర్మాణాత్మక పనులు చేయండి. తప్పుడు సహవాసాలు లేని చిక్కులు తీసుకొస్తాయి. డ్రగ్స్ అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. ప్రేమలో ఉన్న యువకులు.. పెళ్లి విషయంపై ఈ నెల ప్రారంభంలోనే పెద్దలతో చర్చించాలి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకోవాలి.
అత్త, మామలతో వివాదాలు వద్దు:
కుటుంబంలోని పెద్దలను గౌరవించండి, వారితో ఎప్పుడూ మర్యాదపూర్వకంగా మెలగండి. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. కుటుంబంలో తోబుట్టువులతో సత్సంబంధాలు కొనసాగించాలి. సోదరుడితో విభేదాలు ఉండొచ్చు. ఇంట్లో అత్త, కోడలు వివాదాల్లో తలదూర్చవద్దు.జూలై 16 నుంచి జూలై 24 వరకు కుటుంబంతో గడపండి. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. అత్త, మామలతో వివాదాలు పెంచుకోవద్దు.
మాటతోనే విజయం సాధిస్తారు
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనసులో ఏది ఉంటే అది బయటకు మాట్లాడేయకండి. అది మీ సంబంధాలను చెడగొడుతుంది. బీపీ ఉన్నవారు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలి. సామాజిక దృక్కోణంలో ఏ విషయంలోనూ అతి ధైర్యం ప్రదర్శించవద్దు. లేనిపక్షంలో సంక్షోభంలో చిక్కుకుంటారు. విద్యార్థులు చదువులో కష్టపడాలి. విద్యార్థులు పాత పుస్తకాలను పేద విద్యార్థులకు విరాళంగా ఇవ్వండి లేదా ఏదైనా లైబ్రరీకి ఇవ్వండి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు యాక్టివ్‌గా ఉండాలి. అనవసరమైన అబద్ధాలకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారు తమ మాటతీరును చక్కగా ఉంచుకోవాలి, ఎవరితోనూ పరుషమైన మాటలు మాట్లాడకూడదు. మీరు మాటలతోనే యుద్ధంలో విజయం సాధిస్తారనేది సత్యం.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Puri Warns to Bandla Ganesh: చీప్‌గా వాగొద్దు.. నాలుక కొరికేసుకోవడం మంచిదన్న పూరి!
Also Read: Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.