Virginia Lottery Ticket: అదృష్టం ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడుతుందో చెప్పలేం. ఆస్ట్రేలియాలోని హేమార్కెట్లో నివాసం ఉంటున్న ఒక మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వ్యక్తులకు పూలు, చాక్లెట్లు, టెడ్డీ లేదా చిరకాలం గుర్తుండే గిఫ్ట్ ను ఇస్తారు. కానీ, ఆమె భర్త వాలెంటైన్స్ డే నాడు తనకు ఓ లాటరీ టికెట్ బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడా లాటరీనే వారిద్దరి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఏకంగా రూ.10 కోట్లు తెచ్చిపెట్టింది ఆ లాటరీ టికెట్. అయితే ఆ లాటరీ టికెట్ కొనడం ఆమెకు అసలు ఇష్టమే లేదట. ఇంతకీ ఆ విషయమేంటో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


ప్రేమికుల రోజు సందర్భంగా మరియా చికాస్ అనే మహిళ భర్త.. ఆమెకు ఓ లాటరీ టికెట్ ను బహుమతిగా ఇచ్చాడు. అయితే అందుకు ఆమె సంతోషించలేదు. లాటరీ టికెట్ కొన్నందుకు తన భర్తపై మరియా ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. ఆ లాటరీని చిన్న కాగితం ముక్కలా భావించి.. తన భర్తపై మండిపడింది. అయితే అంతకు ముందు లాటరీ ద్వారా తన భర్త ఎలాంటి డబ్బును పొందలేదు. అనవసరంగా లాటరీలపై డబ్బును వృథా చేస్తున్నావంటా అతడిపై మరియా గొడవ పెట్టుకుంది. అయితే ఇప్పుడు అదే టికెట్ ఇద్దరి భవితవ్యాన్ని మార్చేసింది.


అదే లాటరీ టిక్కెట్టు నుంచి 10 కోట్ల రూపాయలు గెలవడంతో భార్య ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయింది. అయితే తొలుత అంత మొత్తం లాటరీ తనకు తగిలిందని మరియా భర్త కూడా నమ్మలేదు. ఆ తర్వాత ప్రైజ్ మనీ గురించి వార్త బయటకు రావడం వల్ల భార్యభర్తలిద్దరికి ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లైంది. వాలెంటైన్స్ డేకి కొన్ని రోజుల ముందు, తన భర్త మానసాస్‌లోని 9103 మాథిస్ అవెన్యూలో ఇన్ అండ్ అవుట్ మార్ట్ నుంచి ఈ లాటరీ టిక్కెట్‌ను కొన్నాడని ఆ మహిళ చెప్పింది. 


Also Read: Trending Video: 9 మూతలు 8 అయ్యాయి.. 9=8?? 99% మంది ఫెయిల్ అయ్యారు.. ట్రై చేయండి!


Also Read: Man Flirting: ఒకేసారి 85 మంది అమ్మాయిలతో సరసాలు.. చివరికి ఇలా దొరికిపోయాడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook