Man Flirting: ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు అమ్మయిలతో ప్రేమాయణం సాగించడం అటు సినిమాల్లో లేదా నిజం జీవితంలో కొందరు గమనించే ఉంటారు. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 85 మంది అమ్మాయిలతో సరసాలు ఆడాడన్న విషయాన్ని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. అయితే అతడికి అప్పటికి తన జీవితంలో ఓ ప్రేయసి కూడా ఉంది. తన ప్రేయసి ఉన్నా.. వేరే యువతులతో మాట్లాడేవాడు. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ స్వయంగా వెల్లడించింది. టిక్ టాక్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది.
టిక్ టాక్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. టోరీ అనే యువతి, తన ప్రియుడు ఓ డేటింగ్ యాప్ ద్వారా 85 మంది అమ్మాయిలతో చాటింగ్ చేసేవాడని తెలుసుకుంది. తన ప్రియుడి మొబైల్ ఫోన్ లో డేటింగ్ యాప్ ను చూసిన మహిళ.. ఆ యాప్ మొత్తాన్ని పరిశీలించింది. ఆ యాప్ చూసిన తర్వాతే.. తాను నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయని ఆమె ఆ వీడియోలో స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేసి.. ఆ ప్రియుడి రాసలీలలను బయటపెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ విధంగా టిక్ టాక్ లో ఓ వీడియో తీసి అతడి బాగోతాన్ని బయటపెట్టింది.
84 మందికీ ఒకే మెసేజ్
ఆ డేటింగ్ యాప్ లో 85 మంది యువతులతో ఆ వ్యక్తి చాట్ చేసేవాడట. తనతో మాట్లాడాలంటూ వారికి మెసేజ్ చేశాడట. తొలుత హాయ్ అనే మెసేజ్ ను 85 మందికి సెండ్ చేసినట్లు టోరీ వెల్లడించింది. అయితే అతడు పంపిన ఏ యువతి దగ్గరి నుంచి సమాధానం రాలేదని టిక్ టాక్ వీడియోలో ఆమె తెలిపింది. తనను ప్రేమిస్తూనే.. అంత మంది అమ్మాయిలతో మాట్లాడాడని ఆమె వాపోయింది. ఆ వ్యక్తి తనను మోసం చేయాలని అనుకున్నాడని టోరీ ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: Viral Video: గుండెలు పిండేసిందిగా.. హోమ్ సిక్‌లో ఉన్న అబ్బాయిని ఓదార్చుతున్న అమ్మాయి!
Also Read: Cycle Stunt Video: ఇది మామూలు స్టంట్ కాదు.. చూస్తే పడి పడి నవ్వుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook