WhatsApp: ప్రస్తుత రోజుల్లో గోప్యత అనేది చాలా ముఖ్యమైన అంశం. మనలో చాలా మంది వాట్సాప్ (WhatsApp)లోని తమ ప్రోఫైల్ పిక్స్ కాంటాక్ట్ లిస్ట్‌ (Contact List)లో లేని వ్యక్తులకు కనబడకుండా ఉండాలనుకుంటున్నారు. ఇతర వ్యక్తులు చూడకుండా  కంట్రోల్ చేసే ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్. యూజర్ ప్రైవసీ (user privacy)లో భాగంగా..ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా మీ ప్రోఫైల్ ఫోటో (Profile Photo)ను అందరికీ కనిపించేలా కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఫోన్ లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అండ్రాయిడ్ యూజర్లు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్..


1. ముందు వాట్సాప్ ఓపెన్ చేసి..స్క్రీన్ కుడి వైపున పైన ఉన్న మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి.
2. సెట్టింగ్స్ లోకి వెళ్లిన తర్వాత అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత అందులోకి వెళ్లి..ప్రైవసీను ఎంచుకోవాలి.
3. ప్రైవసీలోకి వెళ్లిన తర్వాత ఫ్రోపైల్ ఫోటోను ఎంచుకోండి.
4. అది ఓపెన్ అవ్వగానే మై కాంటాక్ట్ లిస్ట్ పై క్లిక్ చేయండి.
ఈ నాలుగు స్టెప్స్  ఫాలోయిన తర్వాత ఓ సారి చెక్ చేయండి. మీ ప్రోఫైల్ పిక్ మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్కు మాత్రమే కనిపిస్తోంది. 


Also Read: Zero Rupee note : మన దేశంలో సున్నా రూపాయి నోటును ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook