Did you know India has a Zero Rupee note? Know when and why it was printed, fascinating details about it: రిజర్వ్ బ్యాంక్ (RBI) వివిధ నోట్లను ముద్రిస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే. మనదేశంలో చలామణిలో ఉండే నోట్లను అన్నింటినీ రిజర్వ్ బ్యాంకే ప్రింట్ చేస్తుంది. రూ. 1 నుంచి రూ. 2,000 నోట్ల వరకు ఆర్‌బీఐ (RBI) ముద్రిస్తుంది. అయితే మన దేశంలో సున్నా రూపాయి నోటు (Zero Rupee note) కూడా ఉందనే విషయం మీకు తెలుసా?
ఈ సున్నా రూపాయి నోటు అనేది ఆర్‌బిఐ సావరిన్ గ్యారెంటీని కలిగి ఉండే నోటు కాదు. ఇది చలామణిలో లేదు. అవినీతికి (corruption) వ్యతిరేకంగా పోరాడేందుకు 2007లో చెన్నైకి చెందిన 5వ పిల్లర్ అనే ఎన్‌జిఓ ఈ నోట్లను ముద్రించింది.
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్ ప్లేస్‌లు, పలు పబ్లిక్ ప్లేస్‌లలో 5వ పిల్లర్ వాలంటీర్లు జీరో రూపాయి నోట్లను (Zero Rupee notes) పంపిణీ చేసేవారు. లంచం ఇవ్వకూడదు.. తీసుకోకూడదు అనే అంశంపై అవగాహన పెంచేందుకు జీరో రూపాయి నోట్లను వారు విస్తృతంగా పంపిణీ చేసేవారు. ఎవరైనా లంచం అడిగితే వారికి ఈ నోటు ఇవ్వండి.. తర్వాత మాకు ఫిర్యాదు చేయండనే కాన్సెప్ట్‌తో 5వ పిల్లర్ ఎన్‌జిఓ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది.
వివాహాలు జరిగే చోట సమాచార డెస్క్‌లు ఏర్పాటు చేసి జీరో రూపాయి నోట్ల గురించి వారు ప్రచారం చేపట్టేవారు. వివాహ వేడుకలతో పాటు బర్త్ డే పార్టీలు, పలు పబ్లిక్ మీటింగ్స్ జరిగే చోట జీరో రూపాయి నోట్లను పంపిణీ చేసేవారు 5వ పిల్లర్ (5th Pillar) వాలంటీర్లు. ఇందుకు సంబంధించిన సమాచార బుక్‌లెట్స్, కరపత్రాలను కూడా పంపిణీ చేసేవారు.
Also Read : Radhe Shyam: ఒక్క ఫైట్ సీన్ లేకుండానే రాధేశ్యామ్ ట్రైలర్.. ఎందుకో తెలుసా?
లంచానికి (Bribe) వ్యతిరేకంగా 5వ పిల్లర్ వాలంటీర్లు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాలలో 1200 కంటే ఎక్కువ పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాలకు వీరు వెళ్లారు.30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండే భారీ సైజ్ జీరో రూపాయి నోట్ బ్యానర్‌పై విద్యార్థులు, ప్రజలతో సంతకాలు సేకరించారు. జీరో రూపాయి నోటు కింద.. "నేను లంచం తీసుకోను.. లంచం ఇవ్వను" అనే క్యాప్షన్ ఉంటుంది. ఇందుకు ఆమోదం తెలుపుతూ 5 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. అలా లంచానికి (corruption) వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడంతో జీరో రూపాయి నోటు (zero rupee note) బాగా పాప్‌లర్ అయ్యింది.
Also Read : Porn Star Offers Footballer: రష్యన్ ఫుట్ బాలర్ కు పోర్న్ స్టార్ సెక్స్ ఆఫర్.. 16 గంటలపాటు ఏకధాటిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook