Truck Restaurant video viral: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా గురించి మనందరికీ తెలిసిందే. అయన బిజినెస్ వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే.. సోషల్ మీడియాకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తనకు నచ్చిన స్ఫూర్తిదాయక వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఆ వీడియోలు పోస్ట్ చేసేటప్పుడు అదిరిపోయే క్యాప్షన్ కూడా పెడతారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. అది కాస్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే..రోడు పక్కన ఓ పుడ్ ట్రక్ ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చి స్విచ్ అన్ చేయగానే ఆ పుడ్ ట్రక్ కాస్త రెస్టారెంట్ గా మారిపోయింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతిదీ సులభమైపోయింది. తాజా ఇన్నోవేషనే దానికి ఉదహరణ. రెస్టారెంట్ పెట్టాలంటే భారీగా ఖర్చు అవుతుంది. అద్దెలు, వర్కర్స్ కు శాలరీలు, ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే తడిసి మోపడవుతోంది. అదే ఈ ట్రక్ రెస్టారెంట్ అయితే అద్దెలతో పనిలేదు, ఎక్కడ పడితే అక్కడకు తీసుకెళ్లి వ్యాపారం చేసుకోవచ్చు. ఆ వ్యాపారస్తుడి సృజనాత్మకతకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయ్యాడు. వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 


``ఫాస్ట్ ఫుడ్.. ఫుడ్ ట్రక్స్.. ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్స్. ఈ కొత్త బిజినెస్ ఐడియా వల్ల ఒక దగ్గరే రెస్టారెంట్ ఉండాల్సిన పనిలేదు. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడకు తీసుకెళ్లొచ్చు`` అంటూ ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా దీనిపై నెటిజన్స్ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. 'ఐడియా చాలా బాగుందని ఒకరు.. అద్దెల భారం తగ్గుతుందని' మరొకరు ట్వీట్ చేశారు.



Also Read: Viral video today: వామ్మో.. హెయిర్ కటింగ్ ఇలా కూడా చేస్తారా?.. వైరల్ అవుతున్న వీడియో


Also Read: Viral New: దేవుడి హుండీ లెక్కింపులో షాకింగ్ ఘటన.. నా అప్పుల బాధ్యత నీదేనంటూ లెటర్... ఎక్కడో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook