Viral Video: గుడ్లను తినేందుకు వెళ్లిన పాముకు చుక్కలు చూపించిన పక్షులు.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video today: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. నెట్టింట ఈ మధ్య పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Trending Video today: సోషల్ మీడియాలో ఈ మధ్య పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. చెట్టుపై ఒంటరిగా ఉన్న బర్డ్స్ ను, వాటి గూళ్లలోని పిల్లలను పాములు తింటూ ఉంటాయి. ఒక్కోసారి పక్షులు వాటిని ప్రతిఘటిస్తాయి, మరోకసారి పాములకు ఆహారంగా మారతాయి. తాజాగా ఓ పాము పక్షి గూడులో ఉన్న గుడ్లను తినేందుకు చెట్టుపైకి వెళ్తోంది. గూడులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పాముకు అక్కడున్న పక్షులన్నీ కలిసి చుక్కలు చూపిస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ పాము పక్షి గుడ్లను తినేందుకు చెట్టు పైకి ఎక్కుతోంది. చెట్టు కొమ్మల చివరల ఉన్న పక్షి గూడులోకి వెళ్లి గుడ్లు కోసం వెతుకుతూ ఉంటుంది. గూడులోకి పాము వెళ్లడాన్ని గమనించిన పక్షులు ఒక్కసారిగా దానిపై దాడి చేయడం మెుదలుపెడతాయి. ముక్కుతో పామును పొడుస్తూ దాన్ని అక్కడ నుంచి తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తూ పామును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బర్డ్స్ పరేషాన్ చేయడంతో హడలిపోయిన పాము అక్కడి నుంచి తోకముడుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఈ వీడియో travelexploreprotect అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ పక్షి ప్రేమ చూస్తుంటే గుండె తరక్కుపోతోంది’ అని కొందరు, 'తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందని' మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ కూడా వస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వీడియోలు రోజుకు వందలకొద్దీ వైరల్ అవుతున్నాయి. డిఫరెంట్ గా, షాకింగ్, ఫన్నీగా ఉన్న వీడియోస్ ను ఎక్కువగా నెటిజన్స్ ఆదరిస్తున్నారు.
Also Read: Viral Video: ఏంటి భయ్యా ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. పరోటాను ఈ రేంజ్ లో ఎవరైనా ఉతుకుతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook