Woman's soul comes out of body: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం బోలెడు వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, పరమ చెత్తగా అనిపించేవి, భయపెట్టేవి... ఇలా రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్నిసార్లు నమ్మశక్యం కాని వీడియోలు సైతం కంట పడవచ్చు. కొంతమందికి అవి పరమ సిల్లీగా అనిపిస్తే.. మరికొందరు మాత్రం నిజమేనని ఇట్టే నమ్మేస్తారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ వీడియోను గమనిస్తే... చీరకట్టులో ఉన్న ఓ మహిళ నేలపై పడుకుని ఉంటుంది. కనుగుడ్లు పెద్దవి చేసి... ముఖంలో భయగొల్పే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తుంది. ఆ వెంటనే ఆమెలో నుంచి ఆత్మ లేచి వచ్చి బిగ్గరగా నవ్వుతుంది. శరీరం నేలపై ఉండగా, ఆత్మ లేచి అటు, ఇటు తిరుగుతుంది.  ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో ఘోస్ట్ మ్యూజిక్ ప్లే అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


టెక్నాలజీ పట్ల కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఇదంతా కనికట్టు అని తేల్చేస్తారు. ఎడిటింగ్‌తో ఇలా మాయ చేసి ఉంటారని ఆ వీడియో చూస్తే ఇట్టే కనిపెట్టగలరు. అయితే ఇలాంటివి నిజంగానే జరుగుతాయని నమ్మేవారు లేకపోలేదు. విఠలాచార్య సినిమాల్లో లాగా నిజంగానే దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, అతీంద్రీయ శక్తులు ఉంటాయని కొంతమంది నమ్ముతుంటారు. అలాంటి వారికి ఈ వీడియో నిజమేనని అనిపించవచ్చు. రెండు రోజుల క్రితం Ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అప్‌లోడ్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకూ 86వేల పైచిలుకు లైక్స్ వచ్చాయి. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 



 


Also Read: Alia Ranabir Kissing Video: అలియా ముందు మోకరిల్లి... ముద్దుతో ప్రేమను వ్యక్తపరిచిన రణబీర్ కపూర్...


Also Read: Mobile Theatre: ఏపీలో తొలి మొబైల్ థియేటర్, ఆచార్య సినిమాతో ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook