Viral Video today: వాటర్ ఫాల్స్‌లో భారీ అనకొండ.. హడలిపోయిన టూరిస్టులు.. వీడియో వైరల్..
Viral Video today: వేసవి కాలం రాబోతుంది. దీంతో చాలా మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్స్ ఫ్లాన్ చేస్తుంటారు. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లిన కొంత మందికి ఊహించని సంఘటన ఎదురైంది.
Anaconda video viral: భూమ్మిద అతి పెద్ద పాము అనకొండ. ఇవి ఎక్కువగా అడవుల్లో సంచరిస్తూ ఉంటాయి. మనం చిన్న పామును చూస్తేనే హడలిపోతాం. అలాంటిది 15 నుంచి 20 అడుగుల అనకొండ కళ్లముందు కనిపిస్తే ఏమైనా ఉందా మన ప్రాణాలు గాల్లోనే పోతాయి. ఎండా కాలం రాబోతుంది. దీంతో చాలా మంది టూర్స్ ఫ్లాన్స్ చేస్తుంటారు. వేసవిలో ఎక్కువగా కూల్ గా ఉండే ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. వాటర్ ఫాల్స్, మంచు ప్రదేశాలు, నదీ తీర ప్రాంతాలకు వెళ్తూంటారు. తాజాగా కొంత మంది టూరిస్టులు ఎంజాయ్ చేద్దామని వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లారు. ఇంతలోనే వారికి ఊహించని సంఘటన ఎదురైంది.
కొంత మంది జలపాతంలో స్నానాలు చేసేందుకు దిగుతున్న సమయంలో ఓ భయంకరమైన ఆకారం వారికి కనిపించింది. వారు దూరం నుంచి జూమ్ చేసి చూడగా.. అది భారీ అనకొండగా తేలింది. దీంతో వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వారు తమ జీవితంలో అంత పెద్ద పామును ఎప్పుడు చూడకపోవడంతో హడలిపోయారు. కాస్త సమయం తర్వాత దాని నుంచి తేరుకుని.. దాంతో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో నైజీరియా మ్యూజిక్ అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియోకు విపరీతమైన లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. దీనిని బట్టి టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి వీడియోలు నెట్టింట ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్ అవుతున్నాయి.
Also Read: Snake Bite: పాములు కుట్టబోయే ముందు ఈ సిగ్నల్స్ ఇస్తాయంట.. అలర్ట్ అయితే రిస్క్ నుంచి బైటపడ్డట్లే..
Also Read: Viral Video: గుర్రంపై స్వారీ చేసినట్లు గేదెపై వెళ్తే ఎలా గురూ.. ఇలాగే జరుగుతోంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి