Viral: ప్రేమికుల రోజు నాడు ప్రియురాలి ఇంటికి యువకుడు.. కట్ చేస్తే యువతి తల్లి చేతిలో చెప్పు దెబ్బలు..
Viral Video: ప్రేమికుల రోజు నాడు ప్రియురాలి ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్ అయ్యాడు ఓ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి.
Trending video today: ఒకసారి ప్రేమలో పడ్డారంటే అంతే... అక్కడి నుంచి చాటింగ్స్, మీటింగ్స్, డేటింగ్స్.. ఇలా చాలానే జరుగుతుంటాయి. అయితే ప్రేమికులకు ఉండే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారి లవ్ ఇంట్లో ఎక్కడ తెలుసుపోతుందేమోనని తెగ భయపడుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ ప్రేమ జంట ప్రేమికుల రోజు నాడు ఎలాగైనా కలవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఆ యువకుడు వాలైంటైన్స్ డే(Valentine's Day) నాడు ప్రియురాలి ఇంటికి వెళతాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే.. వారిద్దరూ మేడపై కలుస్తారు. వారిని చూసిన చుట్టపక్కల వారు యువతి తల్లికి చెబుతారు. అప్పటికే ఆ యువతి తన ప్రియుడిని ఓ గదిలో దాచిపెడుతుంది. విషయం తెలుసుకున్న యువతి తల్లి హుటాహుటిన మేడపైకి వస్తుంది. ఆ యువకుడు ఎక్కడ కనిపించడు. కూతురుపై అనుమానం వచ్చి మెుత్తం వెతకగా. అటు పక్క గదిలో యువకుడు ఉండటంతో షాక్ అవుతుంది. ఇక పట్టరాని కోపంతో అతడిని బయటకు లాక్కొచ్చి చెప్పుతో కొడుతోంది. అతడు ఏదోలాగా తప్పించుకుని పారిపోతాడు. అయినా కోపం తగ్గని ఆ తల్లి తన కూతురుని కూడా చెప్పుతో ఎడాపెడా బాదుతుంది.
అక్కడి జరిగిన ఘటనను పక్కింటి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. ఈ ప్రేమికుల రోజు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.
Also read: Bull stops Cricket Match: ఎద్దు వల్ల ఆగిన క్రికెట్ మ్యాచ్.. వైరల్ అవుతున్న వీడియో..
Also Read: Viral Video today: ఈ పాము మినరల్ వాటర్ తప్ప జనరల్ వాటర్ తాగదట.. వైరల్ అవుతున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook