Viral Video today: ఈ పాము మినరల్ వాటర్ తప్ప జనరల్ వాటర్ తాగదట.. వైరల్ అవుతున్న వీడియో.. 

Trending video: ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ  నాగు పాము జనరల్ వాటర్ కాదని మినరల్ వాటర్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 01:55 PM IST
Viral Video today: ఈ పాము మినరల్ వాటర్ తప్ప జనరల్ వాటర్ తాగదట.. వైరల్ అవుతున్న వీడియో.. 

Viral Video today: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్య వెరైటీగా ఏం చేసినా నెట్టింట ఇట్టే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా యానిమల్స్, స్నేక్స్ కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. పాములు భూమ్మిద అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటు వేశాయంటే ప్రాణాలు వెంటనే గాల్లో కలిసిపోతాయి. 

అయితే హిందువులు పాములకు దైవత్వం ఉందని నమ్ముతారు. అందుకే గుడులు కట్టి పూజలు చేస్తారు. అంతేకాకుండా నాగుల చవితి అనే ప్రత్యేక పండుగను కూడా జరుపుకుంటారు. ఈరోజున పాములకు పాలు పోస్తారు. అవి కూడా ఎంతో శ్రద్ధగా పాలు తాగుతుంటాయి. ఎండలు మండిపోతుండటంతో పాములకు నీళ్లు కూడా దొరక్క చనిపోతున్నాయి. తాజాగా ఓ నాగుపాముకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. 

మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ ధాన్యం వ్యాపారి వీరేంద్ర అగర్వాల్ ఇంట్లో ధాన్యం బస్తాల మధ్య ఓ డేంజరస్ నాగుపాము నక్కి ఉండటాన్ని స్థానిక ప్రజలు గమనించారు. దీంతో భయాందోళన చెందిన వారు స్నేక్‌ క్యాచర్‌ శ్రీకాంత్ ఫోన్ చేసి రప్పించారు. గోదాం వద్దకు చేరుకున్న శ్రీకాంత్ నాగుపామును కాపాడి సురక్షితంగా అడవిలో విడిచిపెట్టాడు. అయితే పాము దాహంతో ఉన్న విషయాన్ని గుర్తించిన శ్రీకాంత్ వాటర్ బాటిల్ తో దానికి నీళ్లు పట్టాడు. అయితే పాము పక్కన ఉన్న జనరల్ వాటర్ తాగడం మానేసి.. సీసాలోని నీరు తాగడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పాము మినరల్ వాటర్ తాగడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: Viral Video: వావ్.. అట్లుంటదీ మరీ.. లెహంగా వేసుకుని లండన్ వీధుల్లో హల్ చల్ చేసిన భారత యువతీ.. వైరల్ వీడియో..

Also Read: Delhi Rikshawala: రిక్షావాలా అని తక్కువ చూడొద్దు డూడ్.. ఇంగ్లీష్‌ వింటే నోరెళ్లబెడతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News