Tiger walking video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫన్నీ లేదా ఇంట్రెస్టింగ్ వీడియోలు పోస్ట్ చేస్తూ తమ క్రియేటివిటీని చాటి చెప్తారు. అలాగే చిత్ర విచిత్ర వీడియోలు షేర్ చేస్తూ.. తమ వ్యూస్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టైగర్ కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే...
ఇందులో ఓ పిల్లవాడు పెద్దపులిని వాకింగ్ తీసుకెళ్తాడు. దాని మెడకు ఉన్న గొలుసును బుడ్డోడు పట్టుకుంటాడు. కొంత దూరం నడిచాక పులి ముందుకు వెళ్తుంది. ఇంతలో ఆ కుర్రాడు వెనకే ఉండిపోయి.. గొలుసును పట్టుకుంటాడు. పులి మెడకు గట్టిగా బిగిసుకోవడంతో అది ఒక్కసారిగా గాండ్రించి.. బుడ్డోడిపైకి దూకబోతుంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి దానిని కర్రతో కంట్రోల్ చేస్తాడు. దాంతో ఆ టైగర్ వెనక్కి తగ్గుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 


Also Read: Trending Video: ఐడియా అదిరిపోయింది గురూ.. గుర్రంపై ఫుడ్ డెలివరీ.. ఈ వ్యక్తి మాములోడు కాదు..!


లాహోర్‌కు చెందిన యూట్యూబర్ నౌమన్ హసన్ ఈ వీడియోను ఇన్ స్టాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను చూసినవారు తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. బుడ్డోడా అది కుక్క కాదు.. పులిరా అని ఒకరంటే.. ఆ పిల్లోడి జీవితం పులి మూడ్‌పై ఆధారపడి ఉంటుందని మరొకరు రాసుకొచ్చారు. అయితే పిల్లలను క్రూరమృగాల దగ్గరకు తీసుకెళ్లేటప్పుడు, వాటితో నడుచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో 35 మిలియన్లకుపైగా  చూశారు. అంతేకాకుండా ఎన్నో లక్షల లైక్స్ కూడా వచ్చాయి. ఇంకెందుకు ఆలస్య మీరు కూడా  ఈ వీడియోపై ఓ లుక్కేయండి. 



Also Read: Viral News: మూడు నెలల క్రితం అంత్యక్రియలు.. సడెన్‌గా ప్రత్యక్షమై ఊహించని షాకిచ్చిన వ్యక్తి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook