Sachin Tendulkar: గాయపడిన పక్షిని కాపాడిన సచిన్, వీడియో వైరల్
Viral Video: ఓ బీచ్‌లో గాయపడిన పక్షిని రక్షించి..తన గొప్ప మనసును చాటుకున్నాడు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
Sachin Tendulkar saves an injured bird at beach: 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, భారత మాజీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అభిమానుల హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నాడు. నిస్సందేహంగా ఆల్ టైమ్ బ్యాటర్‌గా పరిగణించబడుతున్న సచిన్ ఇటీవల బీచ్‌లో గాయపడిన పక్షిని రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాలో పంచుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్.
ఈ వీడియోలో ఓ పక్షి గాయపడి ఉంటుంది. దానికి నీళ్లతోపాటు ఆహారం కూడా తినిపిస్తాడు సచిన్. ‘'మనం అందించే కొంచెం ప్రేమ, ఆప్యాయత ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా మార్చుతుంది' అంటూ క్యాప్షన్ జోడించారు. మాస్టర్ బ్లాస్టర్ గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ (Viral Video) అవుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు కోటి 30 లక్షల మందికి పైగా లైకులు సాధించింది.
1989లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు సచిన్. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 48 ఏళ్ల సచిన్.. ఇంటర్నేషనల్ క్రికెట్ అన్ని ఫార్మాట్ ల్లో కలిపి 34,357 పరుగులు చేశాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
Also Read: Dhoni New Look: నయా లుక్‌లో ధోనీ.. ఎవరూ గుర్తుపట్టలేనంతగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి