Viral Video today:  సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ మధ్య  జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములు, ఏనుగులు, పులుల వీడియోలు నెటిజన్స్ ఎక్కువగా వీక్షిస్తున్నారు. కొంచె ఢిపరెంట్ గా ఉంటే చాలు ఏ వీడియో అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది.  తాజాగా పెద్ద పులికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. అడవిలోని నీటి మడుగు దగ్గరకు పెద్దపులి వెళ్తుంది. అది నీరు తాగడానికి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడికి వెళ్లిన పులి ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో పట్టుకుని రావడాన్ని మీరు వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ దీప్ కతికర్ ఈ వీడియోను షూట్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఫ్లాస్టిక్ అడవిలోకి వెళ్లిందంటే మనం వాడకం ఎంత ఎక్కువైందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది. మూగజీవాలు తెలియకుండా ఈ ఫ్లాస్టిక్ తింటే చాలా ప్రమాదకరం. అందుకే ఫ్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. 



Also Read: Leaked Romance Video: క్లాస్ రూమ్‌లోనే టీచర్, స్టూడెంట్ రొమాన్స్..రచ్చ లేపుతున్న లీక్‌ వీడియో!


Also Read: Minister Muddy: బురదలో ఇరుక్కుని మంత్రి తంటాలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook