Old woman eating pizza: పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ రుచి అంటే ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలు, యువతలో చాలామందికి తెలిసిన విషయమే. నేటితరం టీనేజ్ పిల్లలు, పెద్దలు ఏదో ఒక సమయంలో జంక్ ఫుడ్ టేస్ట్ చేసే ఉంటారు. ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా... ఏదో ఒక టెంప్టింగ్ టైమ్‌లో దాన్ని టేస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ వృద్ధులు అలా కాదు. జంక్ ఫుడ్ తినాలంటే జంకుతారు. బయట రెస్టారెంట్లో వండే పిజ్జాలు, బర్గర్లు లాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కంటే.. ఇంట్లో కష్టపడి వండుకునే ఆహారమే మేలు అంటారు. అలా వాళ్లు ఫాస్ట్ ఫుడ్ జోలికి పెద్దగా వెళ్లనే వెళ్లరు. అందుకే వాళ్లకు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలిసే ఛాన్స్ లేదు. మరి అలాంటి వాళ్లకు ఒక్కసారి పిజ్జా రుచి చూపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి!! అయినా.. ఇప్పుడిదంతా మాకు ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూసేయండి. ఎందుకో మీకే అర్థమవుతుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


చూశారు కదా.. తొలిసారిగా పిజ్జా రుచి చూసిన ఒక బామ్మ (Old woman eating pizza) ఇచ్చిన రియాక్షన్ ఇది. బామ్మకు పిజ్జా రుచి చూపించిన ఆమె మనవడు.. ఆమె పిజ్జా తింటుండగా ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి ఆమె హావాభావాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోకు 55 వేలకు పైగా లైక్స్ రాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


తొలిసారిగా పిజ్జా తిన్న బామ్మ ఇచ్చిన ఆ రియాక్షన్ చూస్తే... ఆమెకు పిజ్జా అసలే నచ్చలేదని అర్థమవుతోందంటున్నారు ఈ వైరల్ వీడియో (Viral videos) చూసిన నెటిజెన్స్.