అనవసర సందేశాలు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను వాట్సాప్‌లో పోస్టు చేస్తూ గ్రూప్లో ఉన్న మిగితా సభ్యులను ఇబ్బంది పెడుతున్నారా? అయితే వారిని నియంత్రించేలా యాప్‌లో మార్పులు చేస్తోంది 'వాట్సాప్'. దీంతో గ్రూప్ అడ్మిన్‌లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా ప్రయత్నిస్తోంది.


అడ్మిన్ తలచుకుంటే ఇలాంటి సందేశాలను ఆపేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న వాట్సాప్ బీటా వర్షన్ 2.17.430లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఈ సదుపాయం కేవలం గ్రూప్ అడ్మిన్‌లు మాత్రమే వినియోగించుకోవచ్చు. ఒక్కసారి సదరు సభ్యుడిని ఈ జాబితాలో చేరిస్తే.. ఆ సభ్యుడు గ్రూప్‌ లో ఇతరులకు పంపే మెసేజెస్‌లను చదివేందుకు మాత్రమే వీలుంటుంది. తన మెసేజ్‌ను గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ చేరవేయాలనుకుంటే మెసేజ్‌ను టైప్ చేసి 'మెసేజ్ అడ్మిన్' బటన్‌ను నొక్కాలి. దీన్ని గ్రూప్ అడ్మిన్ ఓకే అంటేనే ఆ మెసేజ్ పోస్ట్ అవుతుంది.