Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..
West bengal: ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ఒక అభ్యర్థి వెరైటీ మార్గంను ఎంచుకున్నాడు. అతను బర్రెమీద స్వారీ చేస్తు వచ్చి తన నామినేషన్ ను దాఖలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
west bengal an independent candidate Ajit Prasad nomination on buffalo: ఎన్నికలు వచ్చాయంటే చాలా నేతలు వెరైటీ వెరైటీ స్టంట్ లు చేస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో మనం తరచుగా నాయకులు మన ఇళ్లలోకి, గ్రామాల్లోకి రావడం చూస్తుంటాం. కొందరు మన ఇళ్లలోనికి ఓటు వేయమనడానికి వచ్చి పిల్లలకుస్నానం చేయిస్తుంటారు. వంటలో హెల్ప్ చేసినట్లు పోజులు ఇస్తారు. ఇక హోటల్స్ లలో టిఫిన్ లు చేసినట్లు, దోశలు వేసినట్లు, చాయ్ లు చేసినట్లు నానా రచ్చచేస్తుంటారు. మరికొందరు ఎన్నికలలో ప్రజల దగ్గరకు వెళ్లి వెరైటీగా ఓట్లను అడుతుంటారు. కొందరు తమ ఆడపిల్లలను, భార్యలను సైతం రంగంలోకి దింపుతుంటారు.బొట్టుపెట్టి మరీ ఓటు వేయాలని వేడుకుంటారు. కొందరు దేవుళ్ల మీద ఓట్టులు వేసి, తమ పిల్లల మీద, తమ మీద కూడా ఓట్లు వేయించుకుంటారు.
అంతేకాకుండా సీక్రెట్ గా బహుమతులు, చీరలుకూడా పంచుతుంటారు. కానీ ఎన్నికల అధికారుల వరకు సీక్రెట్ లీకవ్వకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుంటారు. ప్రస్తుతం ఓటర్లు కూడా తమ ట్రెండ్ ను మార్చుకున్నారు. ఎవరు ఏమిచ్చిన కూడా తీసుకుంటున్నారు. కానీ తమకు నచ్చిన వారికి మాత్రమే ఓటు వేస్తున్నారు. ఇక ఎన్నికలలో పోటీ చేయాలంటూ మొదట నామినేషన్ వేయాలి. నామినేషన్ వేయడంలో అభ్యర్థులు వినూత్న పంథాను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ లోని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి అజిత్ ప్రసాద్ వినూత్నంగా తన నామినేషన్ ను దాఖలు చేశాడు. ఇతగాడు..పురూలీయా నుంచి ఎన్నికల బరిలో ఉంటున్నాడు. దీంతో తనకు మద్దతు తెలియజేస్తున్న కార్యకర్తలతో కలిసి బర్రెమీద ఊరేగింపుగా వచ్చాడు. అంతేకాకుండా.. అడుగడుగున తనకు ఓటువేయాలని కూడా అభ్యర్థిస్తు వచ్చాడు. భారీ జన సందోహాం మధ్యన వచ్చి ఎన్నికల అధికారులకు తన నామినేషన్ ను సమర్పించాడు.
ఇదిలా ఉండగా.. అజిత్ ప్రసాద్ కొన్నేళ్లుగా.. వెస్ట్ బెంగాల్ లోని కుర్మీ కమ్యునిటీ షెడ్యూల్ తెగకోసంప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరుతూ ఉద్యమిస్తున్నాడు. తాను ఎంపీగా గెలిస్తే తమ సమస్యలను పార్లమెంట్ లో చర్చించి, మంచి ఫలితం వచ్చే వరకు పోట్లాడుతానంటూ కూడా ప్రజలకు వెల్లడించాడు. ప్రస్తుతం అతను బర్రెపై ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేయడంను కొందరు ఆసక్తిగా గమనించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter