WhatsApp View Once Feature: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిరంతరం అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. తన వినియోగదారులకు కొత్తగా మరో ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ మేరకు ఆ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ సంస్థ వెల్లడించింది. మరోవైపు వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంగీకరించని యూజర్లకు సైతం సేవలు కొనసాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సాప్ నుంచి ఎవరైనా యూజర్ తమ కాంటాక్ట్‌కు వీడియోలు, ఫొటోలు, టెక్ట్ మెస్సేజ్‌లు సైతం చేయవచ్చు. వీడియో కాలింగ్ సదుపాయాన్ని సైతం కోవిడ్19 వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో వాట్సాప్ అప్‌డేట్ చేసింది. తాజాగా వ్యూ వన్స్ (WhatsApp View Once Feature) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. మీరు ఎవరికైనా వాట్సాప్‌లో ఫొటో, వీడియో, టెక్ట్స్ మెస్సేజ్ చేస్తే అది అందుకున్న వారు కేవలం ఒకసారి మాత్రమే అది చూడగలరు. ఒకసారి బ్యాక్ క్లిక్ చేసి మళ్లీ ఆ మెస్సేజ్ ఓపెన్ చేస్తే వారికి కనిపించదు. వాట్సాప్ (WhatsApp) సంస్థ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో పరీక్షిస్తోంది. త్వరలోనే వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ అందుబాటులోకి తెస్తామని పేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు.


Also Read: Bank Holidays In July 2021: జులై నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్, వివరాలివే


వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.21.14.3 బీటా వర్షన్ యూజర్లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఓఎస్ బీటా యూజర్లకు సైతం త్వరలోనే వ్యూ వన్స్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఇతరులు తమ మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు  కేవలం ఒకసారి చూడాలనుకుంటే ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలి. అప్పుడు మెస్సేజ్ రిసీవ్ చేసుకున్నవారు కేవలం ఒక్కసారి మాత్రమే ఈ విషయాన్ని చదవగలరు, చూడగలరు. వాట్సాప్ (WhatsApp Privacy Policy) గ్రూపులలో సైతం ఈ ఫీచర్ పని చేస్తుంది.


Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook