వాట్సాప్ ఈ ఫోన్లలో ఆగిపోనుందా?
వాట్సాప్ ఈ నెల నుండి వినియోగదారులు పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ నిర్ధారించింది.
ప్రపంచంలో ఏ సందేశాన్నైనా నెట్ ఉంటే చటుక్కున చేరవేసేది మెసేజింగ్ యాప్ 'వాట్సాప్'. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు మరింత సులభంగా అందిస్తూ వస్తున్నది. యూజర్లకు మరింత చేరువకావడంతో ఈ యాప్ ను వాడేవారు సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే అన్ని ఫోన్లలో పనిచేసే ఈ యాప్ ఇప్పుడు కొన్ని ఫోన్లలో పనిచేయదు. వాట్సాప్ ఈ నెల నుండి వినియోగదారులు పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ నిర్ధారించింది.
అత్యంత విజయవంతమైన ఈ మెసెంజర్ యాప్ బ్లాక్బెర్రీ ఓఎస్, బ్లాక్బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, పాత ఫోన్లలో డిసెంబర్ 31, 2017 నుంచి ఇక పనిచేయదు అని తేల్చి చెప్పింది. మొదట్లో వాట్సాప్ కాలంచెల్లిన మొబైల్ ప్లాట్ ఫార్మ్స్ లో 2016 డిసెంబర్ దాటితే పనిచేయదని యూజర్లకు చెప్పారు. కానీ సంవత్సరం చివర్లో ఫేస్బుక్ యాజమాన్యం బ్లాగ్ పోస్ట్ ను నవీకరించి.. వినియోగదారులకు జూన్ 30, 2017 వరకు గడువు విధించింది.
ఆతరువాత మళ్లీ యాప్ ను అప్డేట్ చేసి డిసెంబరు 31, 2017 వరకు డెడ్ లైన్ పెట్టారు. ఇకపోతే డిసెంబర్ 31, 2018 తర్వాత నోకియా ఎస్40లో, 2020 ఫిబ్రవరి1వ తేదీనాటికి ఆండ్రాయిడ్ 2.3.7 ఓఎస్ ఉన్న ఫోన్లలో కూడా వాట్సాప్ పనిచేయదని వివరించింది.
వాట్సాప్ ప్రకారం, "ఈ మొబైల్ ప్లాట్ ఫార్మ్స్ లో అంత చురుగ్గా డెవలప్మెంట్ అనేవి కనబడటం లేదు. కనుక కొన్ని ఫీచర్లు ఎప్పుడైనా పనిచేయడం ఆపేయవచ్చు" అని పేర్కొనింది. మీరు నిత్యం వాట్సాప్ పైనే ఆధారపడినవారైతే.. కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కోండని సలహాఇచ్చింది.