Whatsapp Account: కఠిన చర్యలకు దిగిన వాట్సప్, 3 మిలియన్ల ఖాతాలు నిషేధం
Whatsapp Account: సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తరువాత అసత్య సమాచారం, హానికర సందేశాలు ఎక్కువైపోయాయి. సోషల్ మీడియా వేదికలపై నమ్మకం పోతున్న పరిస్థితి. అందుకే వాట్సప్ కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
Whatsapp Account: సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తరువాత అసత్య సమాచారం, హానికర సందేశాలు ఎక్కువైపోయాయి. సోషల్ మీడియా వేదికలపై నమ్మకం పోతున్న పరిస్థితి. అందుకే వాట్సప్ కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
సోషల్ మీడియాతో(Social media)ప్రయోజనం ఏ మేరకు ఉందో..నష్టాలు కూడా అంతే ఉన్నాయి. అనుచితమైన సమాచారం, హానికర సందేశాలు, అసత్య వార్తలతో నిండిపోతోంది. ఈ క్రమంలో అసత్య, అనుచిత సమాచారాన్ని అరికట్టేందుకు, యూజర్‌కు మంచి అనుభవాన్ని అందించేందుకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సప్ చర్యలకు ఉపక్రమించింది. జూన్-జూలై మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాల్ని నిషేదించింది వాట్సప్ సంస్థ. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు,ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి వచ్చిన మెయిల్స్ ఆధారంగా కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో హానికర సందేశాల్ని నియంత్రించేందుకు ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా వాట్సప్ ఎక్కౌంట్‌లను( Whatsapp banned 3 million Accounts) నిషేధించింది. వాట్సప్‌కు సంబంధించి ఫిర్యాదులు చేయాలంటే..wa@support.whatsapp.com కు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం(Central government) ప్రవేశపెట్టిన కొత్త ఐటీ నిబంధనలకు(New IT Rules) అనుగుణంగా వాట్సప్ సేఫ్టీ మంత్లీ రిపోర్ట్ విడుదల చేసింది. 2021 జూన్ 16 నుంచి జూలై 31 మధ్య అంటే 46 రోజుల వ్యవధిలో వాట్సప్ ఆటోమేటెడ్ టూల్స్ 3.027 మిలియన్ల ఎక్కౌంట్లను గుర్తించి నిషేధించింది. హానికరమైన, అనుచితమైన సందేశాల్ని అరికట్టేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు వాట్సప్ తెలిపింది. తప్పుడు సందేశాల వ్యాప్తికి కారణమవుతున్న ఎక్కౌంట్లను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్టు వాట్సప్(Whatsapp) వెల్లడించింది.
Also read: Cake cutting with iPhone: ఐఫోన్‌తో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే తనయుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook