WhatsApp Privacy Policy: వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా
WhatsApp Privacy Policy Update: మే 15లోగా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాలని, లేని పక్షంలో తుది గడువు దాటిన తరువాత వాట్సాప్ వినియోగదారులు పలు సేవల్ని కోల్పోనున్నారని తెలిపారు. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయని పక్షంలో వాట్సాప్ సేవలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది.
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ త్వరలో అమలులోకి రానుంది. మే 15లోగా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాలని, లేని పక్షంలో తుది గడువు దాటిన తరువాత వాట్సాప్ వినియోగదారులు పలు సేవల్ని కోల్పోనున్నారని తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఇదే విధంగా ప్రైవసీ పాలసీ(WhatsApp Privacy Policy) మెస్సేజ్‌లు రావడంతో ఒక్కసారిగా అన్ ఇన్‌స్టాల్స్, వాట్సాప్ అకౌంట్లు డిలీట్లు పెరిగాయి.
భారత్ లాంటి దేశంలో నెటిజన్లు, స్మార్ట్‌ఫోన్ వినయోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే యాప్‌ల నిర్వహణ అంత తేలిక కాదని గ్రహించి మూడు నెలలపాటు ప్రైవసీ పాలసీ అమలును వాట్సాప్ వాయిదా వేసింది. తాజాగా వినియోగదారులకు వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ పాలసీ వివరాలు(WhatsApp Privacy Policy) చెక్ చేసి అంగీకరించాలని సూచించింది. మే 15లోగా వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయని పక్షంలో వాట్సాప్ సేవలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండవని సంస్థ పేర్కొంది. తొలుత కొన్ని రోజుల వరకు కేవలం వాట్సాప్ కాల్స్, నోటిఫికేషన్లు మాత్రమమే రిసీవ్ చేసుకుంటారని ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read: Pink Whatsapp: పింక్ వాట్సాప్ లింక్ క్లిక్ చేయవద్దు, మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది తెలుసా
యాప్ వినియోగదారులు ప్రైవసీ పాలసీ అంగీకారం తెలపకపోతే వాట్సాప్ మెస్సేజ్‌లు పంపించటం గానీ, ఇతరులు మీకు పంపినవి సైతం చదవడం వీలు కాదు. అయితే వాట్సాప్ అకౌంట్ మాత్రం 120 రోజులపాటు ఇన్‌యాక్టివ్ (WhatsApp Inactive)గా ఉంటుందని సంస్థ తన ప్రకటనలో తెలిపింది. లాగిన్ అయిన తరువాత పైన కనిపించే పాలసీని(Agree) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వాట్సాప్‌లో నోటిఫికేషన్ కనిపించలేదంటే మీరు ఇదివరకే వాట్సాప్ నూతన గోప్యతా విధానానికి ఆమోదం తెలిపినట్లు అని అర్థం చేసుకోవాలి.
Also Read: WhatsApp: వినియోగదారులకు వాట్సాప్ సరికొత్తగా Mute Video ఫీచర్, మీరు ట్రై చేస్తారా
మరోవైపు ఢిల్లీ హైకోర్టు గురువారం సీసీఐని వాట్సాప్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీకి వ్యతిరేకంగా విచారణకుగానూ దాఖలైన పిటిషన్లను సింగిల్ జడ్జ్ కొట్టివేయడం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టుతో పాటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని ఆమోదయోగ్యంగా భావించడం లేదు. పూర్తి స్థాయిలో వివరాలు తెలిస్తేనే వాటికి అనుమతి ఇవ్వాలని ధర్మాసనాలు సైతం అభిప్రాయాల్ని వ్యక్తం చేశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook