మ్యాన్ హోల్ ను ( Manhole ) మ్యాన్ హోల్ అని ఎందుకు అంటారు అనే ఆనే డౌట్ మీకు ఎప్పడైనా వచ్చిందా.. ? రోజూ మనకు రోడ్డుపై కనిపించే మ్యాన్ హోల్ పేరు వెనక కూడా ఏదో ఒక మిస్టరీ.. ఏదో ఒక హిస్టరీ ఉండే అవకాశం ఉంది అని అనిపించించిందా.. అయితే ఈ ఆర్టికల్ తో మీ డౌట్ తీరే అవకాశం ఉంది. నిజానికి మ్యాన్ హోల్ అనే పదం 19వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చిన పదం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాయిలర్ రూమ్ లోకి వెళ్లి వచ్చేందుకు అవకాశం కల్పించే చిన్నపాటి మూతతో ఉన్న ద్వారాన్ని మ్యాన్ హోల్ గా పిలిచేవారు. ఈ ద్వారాన్ని మూసే మూతను ఇనుముతో తయారు చేసేవారు. అయితే ఇందులోకి మనుషులు వెళ్లడానికి వీటిని అప్పట్లో నిర్మించలేదు. కేవలం ఈ రంధ్రం నుంచి బాయిలర్ లోపల ఉన్న ముడిభాగాలను చేతితో లేదా పనిముట్లతో అందుకుని.. రిపెయిర్ గట్రా చేసే అవకాశం ఉండేది.




మ్యాన్ హోల్ లో మ్యాన్ అంటే కేవలం పురుషులు (Men ) అని మాత్రమే కాదు. ఆక్స్ ఫర్ట్ డిక్షనరీ ప్రకారం.. మనిషి అనే పదానికి జనరల్ గా వినియోగించే విధానంలో మ్యాన్ అనే పదాన్ని వాడారు. ఇందులో మ్యాన్ అంటే నిజానికి ఆ సొరంగం నుంచి లోపల ఉన్న విడిభాగాలను రిపెయిర్ చేసే హస్తం లేదా చేయి అని.


  • అందుకే కొన్ని పాత బాయిలర్ మ్యాన్యువల్స్ లో మ్యాన్ హోల్ అనే పదానికి హ్యాండ్ హోల్ ( HandHole ) అని కూడా వాడారు.  అయితే మురుగు నీటిని పైప్ లైన్ ద్వారాన్ని కూడా ఆ విధంగానే మ్యాన్ హోల్ అని పిలవడం మొదలు పెట్టారు. అంటే మురుగు నీటి ద్వారం లేదా సొరంగానికి ప్రవేశించేంచే విధానం అనే విధంగా ఈ పదం వినియోగించడం మొదలు పెట్టారు. 

  • Ammonium Nitrate: అమ్మోనియం నైట్రేట్ అంత ప్రమాదకరమా ?


పేరు వెనక...( Behind the Name Of Manhole )
మ్యాన్ హోల్ అనే పేరు అనేది సింపుల్ గా మనిషి ప్రవేశించేంత పెద్దగా ఉన్న ఒక మార్గం అనే విధంగా మారింది. ఇందులో మురుగు నీటి ప్రవాహాన్ని అదుపుచేయడం, విద్యుత్ పనులు చేయడానికి, టెలిఫోన్ లైన్స్ బిగించడానికి, గ్యాస్ లైన్స్ ఫిట్టింగ్ వంటిన పనులు చేయడానికి ఒక వ్యక్తి దూరేంత స్థలం కల్పించడం. ఒక్క ముక్కలో చెప్పాలి అటే నేల కింది భాగంలో ఉన్న వ్యవస్థలోకి మనిషి వెళ్లేంత చిన్న సొరంగమార్గం అని చెప్పవచ్చు.


మరిన్ని పేర్లు.. ( Synonyms of Manhole )
మ్యాన్ హోల్స్ ని యాక్సెస్ ఛాంబర్, యూటిలిటీ హోల్ ( Utility Hole ), మెయింటెనెన్స్ హోల్, ఇన్స్ పెక్షన్  ఛాంబర్ అని కూడా పిలుస్తారు.



పేరు వివాదం ( Controversy on Manhole Term )


మ్యాన్ హోల అనే పేరు లింగ వివక్షకు తావుతీసే విధంతా ఉంది అని 1990లో  అమెరికాలోని కాలిఫోర్నియాలో కొంత మంది నేతలు మ్యాన్ హోల్ ను మెయింటెనెన్స్ హోల్ గా (Maintenance  Hole ) మార్చాలని నిర్ణయించారు.