Krishna Janmastami 2020: శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు

  • Aug 12, 2020, 07:48 AM IST


శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అత్యంత వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రపంచం మొత్తం నంద కిశోరుడి ( Flute of Lord Sri Krishna ) వేణువు నాదానిని మంత్రముగ్దం అయిపోతుంది. శ్రీకృష్ణుడు తన జీవితంలో చేసిన అద్భుతాలు ప్రాణకోటి అందరికీ ఆదర్శాలు. అందుకే ఈ రోజు మాధవుడి జీవితం నుంచి మానవుడి జీవితానికి పనికొచ్చే ఏడు ముఖ్యమైన సూత్రాలను చదువుదాం. వీలైతే పాటిద్దాం.

1 /7

ఒక దూడ తన తల్లిని ఏ వెతుక్కుంటూ ఏ విధంగా వెళ్తుందో.. అదే విధంగా కర్మ కూడా మనిషిని వెతుక్కుంటూ వెళ్తుంది  

2 /7

భగవద్గీతో శ్రీకృష్ణుడి వాణి,  ప్రతీ వచనం అజరామరం. అందులో మాధువుడు ఇలా అన్నాడు... మనిషి శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలిసి పోతుంది. కానీ ఆత్మ మాత్రం శాశ్వతం. ఆత్మకు మరణం లేదు. ఆత్మ పుట్టదు. ఆత్మ మరణించదు.

3 /7

తను భగవంతుడిని అయినంత మాత్రాన.. ఒకరికి కావాలని ఫలాలు అందించను అని.. ఒకరి విధిని తను రాయలేను అని తెలిపాడు.  

4 /7

మనిషి తన కర్మల వల్లే తన విధిని నిర్ధేశిస్తాడన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే మన భవిష్యత్తు నిర్మాణం మన చేతిపనే అని స్పష్టం అవుతుంది.

5 /7

మనిషి పాత వస్త్రాలు త్యజించి..కొత్త వస్త్రాలు ధరించిన విధంగానే.. ఆత్మ కూడా పాత శరీరాన్ని విడనాడి కొత్త శరీరాన్ని చేరుకుంటుంది

6 /7

ఏదైనా కోల్పోతే ఏం చేయాలో శ్రీకృష్ణుడు తెలిపారు. కోల్పోయిన దాని గురించి బాధ పడటం మంచిది కాదు. పేరు, పని, కీర్తి, జననం అనే ప్రతీది నీకు ఇతరుల వల్లే చేకూరింది. ఈ ప్రపంచంలోకి ఖాళీ చేతులతో వచ్చాం. ఖాళీ చేతులతో  తిరిగి వెళ్తాం.

7 /7

జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే..ఏం జరగనున్నా అది మన మంచికే..అందుకే శ్రీకృష్ణుడు అంటాడు... ఏం జరిగినా అది మన మంచికే అని