Woman hit by Train: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్లాట్ ఫామ్ దాటేందుకు ప్రయత్నించిన మహిళ.. ఇంతలో..
Maharashtra Jalgaon: మహిళ ప్లాట్ ఫామ్ మీద నుంచి పట్టాల మీదకు దిగింది. మెల్లగా పట్టాలు దాటుకుంటూ ముందుకు వెళ్లింది. ఇంతలో ఒక్కసారిగా వేగంగా ఒక ట్రైన్ వచ్చింది. మహిళ ఈ విషయాన్ని గమనించలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
Rpf cop rescued woman video viral: చాలా మంది ట్రైన్ లలో జర్నీలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మెయిన్ గా లాంగ్ జర్నీలు చేసేవారు ఎక్కువగా ట్రైన్లలో వెళ్తుంటారు. ట్రైన్ జర్జీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఒక నిముషం తేడా అయిన కూడా.. ట్రైన్ కంటి ముందే వెళ్లిపోతుంది. కొంత మంది గాబారాగా రైల్వే స్టేషన్లకు చేరుకుంటారు. ఒక ట్రైన్ బదులు మరో ట్రైన్ ను ఎక్కేస్తుంటారు. అంతేకాకుండా.. తొందరపాటులో ప్లాట్ ఫామ్ మీద నుంచి, పట్టాల మీదకు దిగి మరీ మరోక చోటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు ఎదురౌతుంటాయి. చాలా సార్లు.. రైలు దిగేటప్పుడు లేదా ట్రైన్ ఎక్కేటప్పుడు కాలు జారీ ప్రయాణికులు రిస్క్ లో పడిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి.
అనేక మంది ప్రయాణికులు రైలు ప్రమాదాలలో తమ ప్రాణాలు సైతం కొల్పోయిన ఘటనలు కొకొల్లలు. ఇదిలా ఉండగా.. రైలుకోసం వెళ్లున్నప్పుడు కొంత మంది ప్రయాణికులు చాలా అజాగ్రత్తగా ఉంటాయి. దీని వల్ల కొన్నిసార్లు ప్రమాదాలలో కొంత మంది చిక్కుకున్నారు. కానీ అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు.. సమయానికి స్పందించి ప్రయాణికులకు ఆపద కల్గకుండా వారిని కాపాడారు. ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మహారాష్ట్రలోని జల్ గావ్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఒక ట్రైన్ వేగంగా దూసుకొని వచ్చింది. సదరు మహిళ మాత్రం ఆ ట్రైన్ ను గమనించలేదు. ఇంతలో అక్కడే విధుల్లో ఉన్న .. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) పోలీసు మహిళను గమనించాడు.వెంటనే పరిగెత్తుకుంటూ పట్టాల మీదకు వెళ్లాడు. అంతేకాకుండా.. సమయస్పూర్తిగా వ్యవహారించి, మహిళను పట్టాల మీద నుంచి ప్లాట్ మీదకు లాగాడు.
స్పీడ్ గా వచ్చి.. మహిళ చేయిని గట్టిగా పట్టుకుని, ఒక్కసారిగా పైకి లాగి ప్రమాదం నుంచి బైటపడేలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అక్కడున్నవారు.. పోలీసు సమయస్పూర్తికి ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ప్రాణాలను కాపాడిన పోలీసుకు మహిళ ధన్యవాదాలు సైతం తెలిపింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పోలీసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook