Woman Running On Moving Train Video: సోషల్ మీడియాలో వెరైటీగా ఉన్న ఘటనలు వెంటనే వైరల్ అవుతుంటాయి. కొంత మంది ఫెమస్ అవ్వడానికి వింత పనులు చేస్తుంటారు. ఓవర్ నైట్లో పాపులారీటీ కోసం ఏవేవో  వేషాలు వేస్తుంటారు. ఒకప్పుడు తమ టాలెంట్ ను అందరికి చూపించే విధంగా ఎలాంటి ప్లాట్ ఫామ్ లు ఉండేవి కావు. కానీ ఇప్పుడు మాత్రం.. సోషల్ మీడియా పుణ్యామా.. అని అందరు వీడియోలు, రీల్స్ చేసి తమ అకౌంట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో వెంటనే ఆ ఘటనలు కాస్త వైరల్  అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని నోరెళ్ల బెట్టేలా ఉంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది పాపులారిటీ కోసం ఏమైన చేస్తున్నారు. రోడ్ల మీద , మెట్రోలల్లో , ఎయిర్ పోర్ట్ లలో వీడియోలు, రీల్స్ తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. కొంత మంది రీల్స్ చేస్తు తమ లైఫ్ ను సైతం రిస్క్ లో పెట్టుకున్న ఘటనలు కొకొల్లలు. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక యువతి రన్నీంగ్ ట్రైన్ మీదకు ఎక్కింది. అక్కడ స్పీడ్ గా జాగీంగ్ కూడా చేస్తుంది.


ఒక ట్రైన్ రన్నింగ్ లో ఉంది. ఇంతలో ఒక యువతి దాని మీదకు ఎక్కింది. ఏదో బంగ్లా మీద అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్లినట్లు దాని మీద జాగింగ్ చేస్తుంది. ట్రైన్ నెమ్మదిగా ఉండటం వల్ల.. యువతి కిందకు పడపోకుండాఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. అక్కడున్న వారు యువతిపనిచూసి షాక్ అవుతున్నారంట.


Read more: Shamshabad Airport: వామ్మో.. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో డెంజరస్ పాములు.. మరీ అక్కడ పెట్టి.. వీడియో ఇదిగో..


మరికొందరు మాత్రం.. ట్రైన్ నుంచి కిందపడితే పరిస్థితి ఏంటని కూడా తిట్టిపోస్తున్నారంట. మరికొందరు మాత్రం..ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తు ఫెమస్ అన్పించుకొవడం ఎందుకని.. ఏకీ పారేస్తున్నారు. పక్కన రోడ్డు మీద వాహనాలు ఉన్నాయి..పొరపాటున పడితే.. నీ లైఫ్ గురించి ఆలోచించుకున్నావా..అంటూ కూడా చురకలు పెడుతున్నారంట. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.