Woman threw snake on bus conductor for not stopping bus in nallakunta Hyderabad: కొన్నిసార్లు ఆర్టీసీ బస్సులు చేయ్యిఎత్తగానే ఆపుతారు. మరికొన్నిసార్లు రద్దీగా ఉంటే... కేవలం బస్ స్టాప్ వద్ద మాత్రమే ఆపుతుంటారు. కానీ కొందరు ఇది అర్ధం చేసుకొకుండా.. డ్రైవర్ తో వాగ్వాదానికి దిగుతుంటారు. అంతేకాకుండా.. గొడవలకు సైతం దిగుతుంటారు. ఈ నేపథ్యంలో.. కొందరుబస్సులపై రాళ్లతో దాడులు చేస్తుంటారు. చంపడానికి సైతం వెనుకాడరు. ఇక తెలంగాణలో ఫ్రీబస్ పథకం తీసుకొచ్చినప్పటి నుంచి ప్రతిరోజు వింత వింత ఘటనలు వార్తలో ఉంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



చిల్లర ఇవ్వలేదని, తమ సీటులో మరోకరు కూర్చున్నారని గొడవలు పడుతున్నారు. ఇక మహిళలు అయితే.. జుట్టు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు.  మొత్తానికి డ్రైవర్ కు చుక్కలు చూపిస్తున్నారు. కొందరు మహిళలు ఫ్రీబస్సు పథకం వల్ల అవసరం ఉన్నా.. లేకున్న ప్రయాణాలు చేస్తున్నారు. అంతేకాకుండా.. తమ ఇంటి పనులు బస్సుల్లోనే చేస్తున్నారు.


కూరగాయలుకోయడం, చంటి పిల్లలను ఆడించడం, బ్రష్ చేయడం వంటి వీడియోలు వైరల్ గా మారాయి.ఇదిలా ఉండగా.. ఇక్కడోక వృద్ధురాలు  బస్సు ఆపమన్నా... ఆపలేడని కోపంతో బస్సుపై దాడికి దిగింది. అంతేకాకుండా.. ఏకంగా బస్సు కండక్టర్ పైన పామును విసిరింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


హైదరాబాద్ లోని విద్యానగర్ లో ఒక వృద్ధురాలు  వింతగా ప్రవర్తించింది. తాను ఆగమన్నా కూడా ఆపలేదని రెచ్చిపోయింది. విద్యానగర్ దగ్గర బస్సుపై బీర్ బాటిళ్లు విసిరింది. దీంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు. ఆ తర్వాత అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో వృద్ధురాలు  మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమెను సముదాయించే ప్రయత్నంచేశారు.


కానీ  ఆమె మరింత రెచ్చిపోయి... తన బ్యాగులో ఉన్న పామును తీసి కండక్టర్ పై విసిరి కొట్టింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. పాము.. కండక్టర్ పైన పడి, పాక్కుంటూ పొదల్లోకి వెళ్లిపోయింది. వెంట్రుకవాసిలో బతికిపోయాయని ఆమె భావించింది. వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వృద్ధురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter