స్మిమ్మింగ్ పూల్‌లో ( Swimming pool ) సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఓ యువతికి అక్కడ అంతే సరదాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తల్చినట్టు స్విమ్మింగ్ పూల్‌లో అందరిలాగే సరదాగా ఎంజాయ్ చేద్దామని ఆమె భావిస్తే.. అక్కడ మరోలా జరిగింది. స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా అందరిలాగే డొలకలు తిరుగుతూ డైవ్ చేద్దామని ట్రై చేసిందామె. బాగానే డైవ్ చేసింది కూడా. కానీ సరిగ్గా అదే సమయంలో ఆమె తలకు పెట్టుకున్న విగ్గు ( Wig falls off ) ఊడిపోయింది. ఆ దృశ్యం చూసి ఘొల్లుమని అక్కడున్న వాళ్లంతా నవ్వాపుకోలేకపోయారు. ఈ దృశ్యం అక్కడి ప్రత్యక్షసాక్షులకే కాదు... సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోను చూసి నెటిజెన్స్ సైతం నవ్వాపుకోలేకపోతున్నారు. ఆ ఫన్నీ వీడియోపై ( Funny video ) మీరూ ఓ లుక్కేయండి మరి. Also watch this video: ప్యాంటులో చొరబడిన నాగుపాము.. వైరల్ వీడియో



జార్జియాలో జరిగిన ఈ ఘటనను చిత్రీకరించిన ఆమె స్నేహితులే ఈ వీడియోను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. '' అప్పటికీ మేము వద్దని చెబుతూనే ఉన్నామని.. అయినా ఆమె వినిపించుకోలేదు'' అని వాళ్లు ఈ వీడియోపై ఓ ఫన్నీ కామెంట్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు అంతే ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. Also read: lizard in Sambar: సాంబార్‌లో సగం బల్లి.. ఇంకో సగం ఏమైందంటూ కస్టమర్ టెన్షన్