lizard in Sambar: సాంబార్‌లో సగం బల్లి.. ఇంకో సగం ఏమైందంటూ కస్టమర్ టెన్షన్

ఆకలేస్తోంది కదా అని హోటల్‌కి వెళ్లి మసాలా దోశ ( Masala dosa ) ఆర్డర్ ఇచ్చి.. ఆ వేడి వేడి మసాలా దోశను వచ్చీరాగానే ఆరగించడం ప్రారంభించిన ఓ వ్యక్తికి సగం దోశ తిన్నాకా తెలిసింది.. తాను తింటున్న సాంబార్‌లో బల్లి ( Lizard in sambar ) పడిందని!! అన్నింటికి మించి ఆ బల్లి సగమే ఉండి ఇంకో సగం భాగం కనిపించకపోవడం అతడిని మరింత కలవరపెట్టింది.

Last Updated : Aug 3, 2020, 11:58 PM IST
lizard in Sambar: సాంబార్‌లో సగం బల్లి.. ఇంకో సగం ఏమైందంటూ కస్టమర్ టెన్షన్

ఆకలేస్తోంది కదా అని హోటల్‌కి వెళ్లి మసాలా దోశ ( Masala dosa ) ఆర్డర్ ఇచ్చి.. ఆ వేడి వేడి మసాలా దోశను వచ్చీరాగానే ఆరగించడం ప్రారంభించిన ఓ వ్యక్తికి సగం దోశ తిన్నాకా తెలిసింది.. తాను తింటున్న సాంబార్‌లో బల్లి ( Lizard in sambar ) పడిందని!! అన్నింటికి మించి ఆ బల్లి సగమే ఉండి ఇంకో సగం భాగం కనిపించకపోవడం అతడిని మరింత కలవరపెట్టింది... సాంబార్‌లో బల్లి వచ్చిందనే టెన్షన్ ఒక ఎత్తైతే... ఆ కనిపించని సగ భాగం ఏమైనట్టు అనే కలవరం ఇంకో టెన్షన్‌కి దారితీసింది. కొంపతీసి తాను తిన్న సగంలోనే ఆ సగం బల్లి కూడా ఉందా ఏంటా అనే ఆలోచనే అతడి కోపాన్ని, కంగారును మరింత రెట్టింపయ్యేలా చేసింది. Also read: Pangolin scales: తెలంగాణ టు చైనా పంగోలిన్ పొలుసుల స్మగ్లింగ్

లగ్జరీ హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లకు ప్రసిద్ధి చెందిన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌‌లో ( Cannaught place in Delhi ) ఉన్న మార్కెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేరున్న హోటల్స్‌కి వారాంతాలతో సంబంధం లేకుండా 365 రోజుల పాటు కస్టమర్ల తాకిడి ఉంటుంది. అలాంటి రెస్టారెంట్లలో ఇదీ ఒకటి. పేరున్న సౌత్ ఇండియన్ హోటల్ కదా అనే అభిరుచితో ఆ హోటల్లో మసాలా దోశ రుచి చూద్దామని తన స్నేహితులతో కలిసి వెళ్లిన వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. Also read: Rakhi festival: రాఖి పౌర్ణమి నాడే మహిళలకు మరో కానుక

సాంబార్‌లో బల్లిని చూడటంతోనే హోటల్ సిబ్బందిని పిలిచి వారిపై ఆగ్రహం వ్యక్తంచేసిన సదరు బాధితుడు.. ఆ సగం బల్లిని చెంచాలోకి తీసుకుని హోటల్ సిబ్బందిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తాను తింటున్న సాంబార్‌లో బల్లి పడిందనే విషయంపై నిరసన వ్యక్తంచేస్తూనే.. మరి మిగతా ఆ సగం బల్లి ఏమైందో చెప్పాలంటూ హోటల్ సిబ్బందిని నిలదీశాడు. ఆయన ఆందోళనంతా ఆ కనిపించని సగం బల్లిని తెలియకుండా తానే తినేశానా ఏంటనేది అతడి టెన్షన్. ఐతే వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో సాంబార్‌లో బల్లి పడిన విషయమై హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకంటే ముందుగా ఆ హోటల్ మెనూలో ఉన్న హోటల్ పేరు కనిపించేలా ఓ వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ( Viral video ) మారింది. Also read: Director Teja: తేజకు కరోనా పాజిటివ్

Trending News