Women Kiss: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వరుసగా అమలు చేస్తూ ప్రజల్లో తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనూహ్య పరిణామం ఎదురైంది. పర్యటన సమయంలో ఫొటో దిగేందుకు వచ్చిన ఓ మహిళ ఆమె ప్రేమపూర్వకంగా చేసిన పని వైరల్‌గా మారింది. చంద్రబాబు దగ్గరకు వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అనంతరం అనూహ్యంగా చంద్రబాబును రెండు చేతులు పెట్టి ముద్దు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె చేసిన పనికి సీఎం నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌


ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం తిరిగి నడుచుకుంటూ తన కాన్వాయ్‌ వద్దకు వెళ్తుండగా ఓ మహిళ అకస్మాత్తుగా చంద్రబాబు వద్దకు దూసుకొచ్చింది. ముఖ్యమంత్రిని కలవాలని చెప్పి దూసుకురావడంతో చంద్రబాబు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో భద్రతా సిబ్బంది అనుమతించారు.

Also Read: YS Vijayamma: విజయమ్మ హత్యకు వైఎస్‌ జగన్‌ కుట్ర? మరో బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ


సీఎం చంద్రబాబు వద్దకు వచ్చిన మహిళ ఎర్ర గులాబీలను ఇచ్చింది. అనంతరం ఫొటోలు దిగింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు ప్రేమతో అతడిని కొంత దించి ముద్దు ఇచ్చే ప్రయత్నం చేసింది. సీఎం చంద్రబాబు వారిస్తున్నా ఆమె బలవంతంగా ముద్దు ఇచ్చేందుకు ప్రయత్నించగా సీఎం చంద్రబాబు అడ్డుకున్నారు. ఆమె భుజంపై చేయి వేసి చంద్రబాబు నిరాకరించారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. టీడీపీ శ్రేణులు 'సీఎం చంద్రబాబుపై అభిమానంతో ఆ మహిళ అలా చేసింది' అని చెబుతుండగా.. ప్రత్యర్థి పార్టీల నెటిజన్లు 'పెద్దాయనే' అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు.


అంతకుముందు జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఐదేళ్ల పాలనలో రోడ్లు నరకానికి మారాయి. ఈ దుస్థితి కారణంగా గత పాలకులే. రోడ్లు అభివృద్ధికి చిహ్నం. గుంతలు లేని ఏపీ రోడ్లుగా తీర్చిదిద్దుతాం' అని ప్రకటించారు. సంక్రాంతిలోపు రోడ్లపై గుంతలు పూడ్చి వేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా చూసే బాధత్య తనదని స్పష్టం చేశారు.




 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.