Telugu Desam Party: వైఎస్సార్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. రాజకీయ భేదాభిప్రాయాలు కుటుంబం మధ్య ఆస్తి తగాదాలు వివాదం రేపగా.. ఆ వివాదం ఒకరికొరు హత్య చేయించుకునే స్థాయికి చేరుకుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షర్మిల లేఖను విడుదల చేసి అతి పెద్ద బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ తాజాగా మరో సంచలన బాంబును పేల్చింది. ఈసారి ఏకంగా వైఎస్ విజయమ్మను హత్య చేసేందుకు జగన్ కుట్ర పన్నాడని తెలుగుదేశం పార్టీ మరో సంచలన ట్వీట్ చేసింది.
Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేత
గతంలో వైఎస్ విజయమ్మ కాన్వాయ్‌కు జరిగిన ప్రమాదాన్ని టీడీపీ వెలుగులోకి తీసుకువచ్చింది. 'ఆ ప్రమాదం యాధృచ్చికమా? లేకా పక్కా ప్రణాళిక?' అంటూ టీడీపీ సందేహం వ్యక్తం చేసింది. 'ఎన్నికల ముందు విజయమ్మ ఎక్కడికి పోయింది? అసలు విజయమ్మ కీలక ఎన్నికల సమయంలో అమెరికా ఎందుకు వెళ్లినట్లు?' అని టీడీపీ ప్రశ్నించింది. షర్మిల గెలుపు కోసం వీడియో పంపిన విజయమ్మ మరి జగన్ పార్టీ గెలుపు కోసం ఎందుకు అప్పుడు స్పందించలేదు' అని టీడీపీ నిలదీసింది.
Also Read: YSR Family Dispute: వైఎస్ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!
'2019 ఎన్నికల్లో బాబాయ్‌ను చంపినట్లు.. ఈ ఎన్నికల్లో విజయమ్మపై స్కెచ్ వేశారా?' అంటూ టీడీపీ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ఈ సందర్భంగా విజయమ్మ కారు రెండు టైర్లు పగిలిపోయిన వీడియోను టీడీపీ పంచుకుంది. ఈ ట్వీట్ ద్వారా వైఎస్ విజయమ్మ హత్యకు వైఎస్ జగన్ ప్రణాళిక వేసినట్లు టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆస్తి కోసం సొంత తల్లి విజయమ్మ, చెల్లె వైఎస్ షర్మిలను కోర్టుకు లాగిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన ఆస్తి వివాదాలను టీడీపీ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న వివాదాలన్నీ తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తీసుకురావడం కలకలం రేపుతోంది. వారం రోజులుగా వైఎస్ కుటుంబ విభేదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ వివాదంలో వైఎస్ జగన్, షర్మిల, విజయమ్మలు రాసుకున్న లేఖలు రాజకీయాలను ఉత్కంఠగా మారుస్తున్నాయి. వీరి కుటుంబ విభేదాలను టీడీపీ పావుగా వాడుకుంటోంది. వైఎస్ కుటుంబ ప్రభను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు... వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు… pic.twitter.com/GWGdbXm6xz
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook
YS Vijayamma: విజయమ్మ హత్యకు వైఎస్ జగన్ కుట్ర? మరో బాంబు పేల్చిన తెలుగుదేశం పార్టీ