Goosebumps Video: అక్కడ అందరూ పాములను మెడకు చుట్టుకొని నదీ స్నానాలు ఆచరిస్తారు..గూస్ బంప్స్ వీడియో
Goosebumps Video: బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పాములను మెడకు చుట్టుకుని గంగా నది స్నానం ఆచరిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Goosebumps Video: కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు విభిన్న ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాలే ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు. అయితే బీహార్లోని పురాతన కాలం నుంచి వస్తున్న ఓ జాతర అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ జాతరకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ జాతర గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వారికోసం మేము ఈరోజు మీ ముందుకు జాతరకు సంబంధించిన ఓ వీడియోని మీ దగ్గరకు తీసుకు వచ్చాం. ఆ వీడియో ఏంటో ఆ సాంప్రదాయం పాటించడానికి కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బీహార్లోని ఓ ప్రాంతంలో యువకులంతా విషసర్పాలను మెడలో వేసుకుని ఊరంతా తిరిగి గండక్ నదిలో స్నానం ఆచరించడం పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. ఈ ఆచారంలో భాగంగా ఆ ప్రాంతంలో నివసించే యువకులంతా ఒక్కొక్కరి మెడకు 20 పాములను చుట్టుకొని గుంపుగా తిరుగుతూ ఉంటారు. ఇలాంటి దృశ్యాలను కలిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. బీహార్ లోని సమస్తిపూర్ లో జరిగే జాతరలో భాగంగా ప్రతి సంవత్సరం నాగదేవతకు ఈ పద్ధతిలోనే పూజలు చేస్తారని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన
ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని నాగపంచమి రోజున బీహార్ లోని ఆ గ్రామంలో ఇలా వింత సాంప్రదాయాన్ని పాటిస్తూ జాతరను జరుపుకుంటారని స్థానికులు అంటున్నారు. ఈ జాతరను చూడడానికి అక్కడున్న ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నుంచి భారీగా తరలి వస్తారట. అంతేకాకుండా ముందు రోజు స్వయంగా కొన్ని పాములు ఆ ఊర్లో నివసిస్తున్న ప్రజల ఇళ్లలోకి వస్తాయని వారు చెబుతున్నారు. వారు ఇవే పాములను ఏమాత్రం భయం లేకుండా మెడలో వేసుకుని ఊరంతా తిరుగుతారు. ఈ వింత సాంప్రదాయాన్ని పాటించడాన్ని చూసి నేటిజెన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ వింత సాంప్రదాయాన్ని పాటించే భక్తులు పాములను స్నేహితులుగా భావిస్తారట. అంతేకాకుండా పౌర్ణమి రోజున ఈ జాతరలో పాల్గొనే ప్రతి యువకుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. భక్తిశ్రద్ధలతో పాములను మెడకు చేతులకు కాళ్లకు చుట్టుకొని సుదూర ప్రాంతంలో ఉన్న గండక్ నదిలో స్నానం చేసి గుడి వద్దకు చేరుకుంటారు. ఈ క్రమంలో పాములు కాటేసే అవకాశం ఉంటుంది. కానీ వారు భక్తిశ్రద్ధలతో ఉండడంవల్ల పాములు వారినేం చేయమని ఆ భక్తుల నమ్మకం.
Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook