Surya-Shani Yog 2023: మరో 48 గంటల్లో కొత్త ఏడాది రాబోతుంది. 2023లో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. జనవరి 17న గ్రహాల న్యాయనిర్ణేత అయిన శనిదేవుడు మకరం నుండి కుంభరాశికి వెళ్లనున్నాడు. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. శనిదేవుడికి తండ్రి సూర్యదేవుడు. ఈ తండ్రీ కొడుకుల మధ్య శత్రుత్వం ఉంది. కుంభ రాశిలో ఈ గ్రహాల కలయిక (Surya-Shani yuti 2023) మార్చి 14, 2023 వరకు ఉంటుంది. సూర్యుడు మరియు శని కలయిక వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం కలుగుతుందో  తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): మేషరాశి యెుక్క దశమ స్థానానికి శని, ఐదవ ఇంటికి సూర్యదేవుడు అధిపతి. సూర్యుడు మరియు శని కలయిక ఈ రాశివారికి శుభప్రదం. దీంతో ఈరాశివారి ధనం పెరుగుతుంది. వివిధ వనరులు ద్వారా ఆదాయం సమకూరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువులు మరియు స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీరు ప్రారంభించిన పనులు సత్ఫలితాలను ఇస్తాయి. 


కన్య (Virgo): కన్యా రాశి వారికి శని ఐదు, ఆరవ ఇంటికి అధిపతి. దేశవిదేశాలలో ఉద్యోగం చేస్తున్న కన్యారాశి వారికి శని, సూర్యుల కలయిక శుభప్రదం. నిరుద్యోగులకు కొత్త జాబ్స్ లభిస్తాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. 


ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశిలో తొమ్మిదో స్థానికి అధిపతి సూర్యుడు మరియు రెండవ మరియు మూడవ ఇంటికి అధిపతి శని. సూర్యుడు మరియు శని ఈ కలయిక మూడవ ఇంట్లో జరుగుతుంది. దీంతో ఈ రాశివారి ధైర్యం పెరుగుతుంది. మీ మాటల ద్వారా ఇతరులను ఆకట్టుకుంటారు. అదృష్టంతో మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. 


Also Read: Shani Dev: న్యూ ఇయర్ లో ఈరాశుల జీవితాన్ని శనిదేవుడు మారుస్తాడు.. ఇక వారికి డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.