Jupiter And Venus Conjunction 2023; ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో తన రాశిని ఛేంజ్ చేస్తుంది. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల 15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. 12ఏళ్ల తర్వాత మీనరాశిలో శుక్రుడు మరియు గురు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈరాశుల సంయోగం ప్రజలందరిపై కనిపిస్తుంది. దీంతో మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు-శుక్ర సంయోగం ఈరాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం
బృహస్పతి మరియు శుక్ర గ్రహాల కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. అంతేకాకుండా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి.  మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. బిజినెస్ చేసేవారు ఈ సమయం బాగుంటుంది. 
వృషభ రాశి
శుక్రుడు మరియు బృహస్పతి గ్రహాల కలయిక వృషభరాశివారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ సంతోషం రెట్టింపు అవుతుంది. మీరు ఏదైనా పని లేదా వ్యాపారం చేయడానికి ఇదే మంచి సమయం. మీ సంతోషం రెట్టింపు అవుతుంది. 
కర్కాటకం
కర్కాటక రాశి వారికి గురు మరియు శుక్ర గ్రహాల కలయిక శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ అదృష్ట ప్రదేశంలో ఈ కూటమి ఏర్పడుతోంది. అందుకే ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. గతంలో చేసిన పనులు మీకు మేలు చేస్తాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. 


Also read: Budh Asta 2023: త్వరలో కుంభంలో బుధుడి అస్తమయం... ఈరాశుల జీవితాల్లో గందరగోళం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.