Second Solar Eclipse 2023 Date and Time in India: సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ సంఘటనలుగా పరిగణిస్తారు. సాధారణంగా గ్రహణాలు అశుభంగా భావిస్తారు. అంతేకాకుండా కొన్ని పనులు చేయడం కూడా నిషేధించారు. ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే రెండు గ్రహణాలు సంభవించాయి. ఇంకా ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబరు 14న జరగబోతుంది. పైగా ఇది చివరి సూర్యగ్రహణం కూడా. ఇప్పుడు ఏర్పడబోయేది కంకణాకృతి సూర్యగ్రహణం. ఈ గ్రహణ సమయంలో చంద్రుడి సూర్యుడిని పూర్తిగా కవర్ చేయలేడు. దీని కారణంగా సూర్యుడు అగ్ని వలయంలా కనిపిస్తాడు. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లుబాటు కాదు. 


ఏయే దేశాల్లో కనిపించనుంది?


ఈ గ్రహణం ఆఫ్రికా యొక్క పశ్చిమ భాగం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్‌లలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం, సూర్యగ్రహణం అక్టోబర్ 14, 2023 రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 02:25 గంటలకు ముగుస్తుంది.


ఈ రాశులపై ప్రతికూల ప్రభావం


Also Read: Chandra Gochar 2023: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?


మేషరాశి:


ఈ సూర్యగ్రహణం మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీరు మీకు సన్నిహితంగా ఉన్నవారి చేతిలోనే మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారు సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్రమత్తంగా ఉండండి.


వృషభం:


సూర్యగ్రహణం వల్ల వృషభ రాశి వారికి ధన నష్టం కలుగుతుంది. మీ మాటలపై అదుపులో ఉంచుకోండి, లేకపోతే మీకు హాని జరగవచ్చు. ఎలాంటి వివాదాల జోలికి పోకండి.  


కన్యారాశి:


సూర్యగ్రహణం కన్యారాశి వారికి కూడా కలిసిరాదు. వీరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో ఎవరితోనూ వాదించకండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. 


తుల రాశి:


సూర్య గ్రహణం తుల రాశి వారిపై కూడా చెడు ప్రభావాలను చూపుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ప్రవర్తన ఇతరులకు చిరాకు కలిగించవ్చు. ఎవరితోనైనా సంభాషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.


Also Read: Shukra Gochar 2023: వచ్చే రెండు నెలల్లో ఈ రాశులవారు కుబేరులవ్వడం పక్కా..మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి