Surya Guru Yuti 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దేవగురు బృహస్పతి ఏడాదికొకసారి తన రాశిని మారుస్తుంది. అంటే గురు గ్రహం మళ్లీ అదే రాశిలోకి రావడానికి 12 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం మీనరాశిలోకి సంచరిస్తున్న బృహస్పతి... ఏప్రిల్ లో మేషరాశిలోకి ప్రవేశించబోతుంది. ఇదే సమయంలో గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు ఏప్రిల్ 14న మేషరాశిలో సంచరించబోతున్నాడు. పుష్కర సమయం తర్వాత ఈరెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు లాభపడనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుల రాశి: ఏప్రిల్ నెలలో దేవగురువు బృహస్పతి మరియు సూర్యుని కలయిక తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బును  ఆదా చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
మిథునం: సూర్యుడు, గురుగ్రహ కలయిక మిథునరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కెరీర్ బాగుంటుంది. విద్యార్థుల మంచి ఫలితాలు సాధిస్తారు. ధన లాభం ఉంటుంది. 
మేషం: గురు-సూర్య సంయోగం మేషరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రేమ లేదా వైవాహిక జీవితం బాగుంటుంది. 


Also Read: Shukra Gochar 2023: మీనరాశిలో వీనస్ సంచారం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.