Sun Transit In Pisces 2023: మార్చి 15న మీనరాశిలో ప్రవేశించబోతున్న సూర్యుడు.. ఈరాశులకు విపరీతమైన ప్రయోజనం
Surya-Shani Yuti 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. సూర్యభగవానుడు మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి సంచారం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది
Sun Transit In Pisces 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ప్రస్తుతం సూర్యుడు శనిదేవుడితో కలిసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ కూటమి ముగియనుంది. సూర్యభగవానుడు మార్చి 15, ఉదయం 6.58 గంటలకు మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. ఏప్రిల్ 14 వరకు ఈ రాశిలో ఉండబోతున్నాడు. దీని తర్వాత సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.సూర్యుడి మీనరాశి ప్రవేశం వల్ల ఏరాశుల వారు బెనిఫిట్స్ పొందనున్నారో తెలుసుకుందాం.
సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
వృషభం
సూర్యుడు వృషభం యొక్క పదకొండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. అంతేకాకుండా ఈరాశి యెుక్క నాల్గో ఇంటికి సూర్యభగవానుడు అదిపతి. మార్చి 15న మీనరాశిలో సంచరించడం వల్ల వృషభరాశి వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏదైనా విలాసవంతమైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
మీ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో సూర్యుడు సంచరించబోతున్నాడు. మీరు ఉద్యోగంలో అనేక బెనిఫిట్స్ పొందుతారు. మీ జీతం పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. మెుత్తానికి ఈసమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
సూర్య సంచార ప్రభావం కుంభ రాశి వారి జీవితాలపై పెను ప్రభావం చూపిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఫ్యామిలీలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
మీనరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు ఈ రాశిచక్రం యొక్క లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభించే అవకాశ ఉంది.
Also Read: Guru Chandal Yoga: 'అశుభకరమైన యోగం' చేస్తున్న గురు.. రాబోయే 6 నెలలపాటు ఈ రాశులవారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి