Jupiter Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని ట్రాన్సిట్ లేదా సంచారం అంటారు. ఈ గ్రహాల సంచారం కారణంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఏప్రిల్ 22న దేవగురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో రాహు గురువు కలయిక జరగనుంది. వీరిద్దరి సంయోగం కారణంగా గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈయోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అశుభకరమైనదిగా భావిస్తారు. దీని కారణంగా కొన్ని రాశులవారు రాబోయే ఆరు నెలలపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
గురు చండాల యోగం ఈ రాశులకు అశుభకరం
మేషరాశి
ఈ రాశి యెుక్క లగ్న గృహంలోనే గురు చండాల యోగం ఏర్పడబోతోంది. ఏప్రిల్ 22 నుండి అక్టోబర్ 30 వరకు ఈ రాశుల వారు అనేక కష్టాలు, అడ్డంకులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.
మిధునరాశి
గురు చండాల యోగం మిథునరాశి వారికి అశుభ వార్తలను తెస్తుంది. ఈ సమయంలో మిథునరాశి వారు ఆరు నెలల పాటు కేర్ పుల్ గా ఉండాలి. డబ్బు సమస్యలను ఎదుర్కోంటారు. పనిలో ఇబ్బందులు వస్తాయి. మీకు ధననష్టం ఉంటుంది.
ధనుస్సు రాశి
గురు, రాహువు ఒకే రాశిలో కలవడం ధనుస్సు రాశి వారి జీవితం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో భారీగా నష్టాలు వస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ కెరీర్ ఒడిదుడుకులకు లోనవుతుంది.
Also Read: Shani gochar 2023: శతభిష నక్షత్రంలోకి శని.. ఈ 6 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
'అశుభకరమైన యోగం' చేస్తున్న గురు.. రాబోయే 6 నెలలపాటు ఈ రాశులవారు జాగ్రత్త..