Venus Planet Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల సంచారం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 12 వరకు శుక్రుడు అదే రాశిలో కదలనున్నాడు. ఈ శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆ లక్కీ రాశులేంటో  తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం
శుక్రుని సంచారం మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి పదవ ఇంట్లో నడవనున్నాడు. శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ జాతకంలో మాళవ్య రాజయోగం కూడా ఏర్పడుతోంది. దీంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 


కన్య రాశిచక్రం
శుక్రుడి రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి సప్తమంలో ప్రయాణిస్తున్నాడు. దీని కారణంగా మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. మీ అన్ని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మిమ్మల్ని కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలగుతుంది. 


మీన రాశిచక్రం
శుక్రుని సంచారం మీన రాశి వారికి కెరీర్ మరియు బిజినెస్ పరంగా బాగుంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి లగ్న గృహంలో సంచరిస్తున్నాడు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 


Also Read: Rajyog: 617 ఏళ్ల తర్వాత నాలుగు రాజయోగాలు.. ఇక ఈ రాశులకు పండగే పండుగ...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


అండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.