Chandra Grahan 2024 effect on Zodiac Signs: సాధారణంగా ప్రజలు గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. సైన్స్ ప్రకారం, సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25న సంభవించబోతుంది. హోలి కంటే ముందు హోలికా దహనం చేస్తారు. ఇది ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు వస్తుంది. దీని తర్వాత రోజున హోలీ వస్తుంది. ఈ ఏడాది హోలీ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇలా జరగడం శుభప్రదం కాదు.  మెుదటి చంద్రగ్రహణం ఎంత సమయం ఉంటుంది? ఇది ఎక్కడెక్కడ కనిపించబోతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రగ్రహణం సమయం
హిందూ క్యాలెండర్ ప్రకారం, తొలి చంద్రగ్రహణం మార్చి 25, సోమవారం నాడు ఏర్పడబోతుంది. ఇది ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.20 గంటల వరకు కొనసాగుతుంది. 
చంద్రగ్రహణం ప్రభావం
ఈ సంవత్సరం ఏర్పడబోయే చంద్రగ్రహణం ఇండియాలో కనిపించదు. దాంతో ఈ గ్రహణం మన దేశంపై పెద్ద ప్రభావం చూపదు. సూతక్ కాలం కూడా చెల్లుబాటు కాదు. దీంతో మనం హోలీ పండుగను హ్యాపీగా జరుపుకోవచ్చు. 


Also Read: Mauni Amavasya 2024: మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి?


చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్, ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, హాలండ్, బెల్జియం, సౌత్ నార్వే మరియు స్విట్జర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.
రాశులపై ప్రభావం
చంద్రగ్రహణం అన్ని రాశిచక్రాలను ప్రభావితం చేయబోతోంది. కానీ జ్యోతిషశాస్త్రం ప్రకారం, దీని ప్రభావం ఎక్కువగా మిథునం, సింహం, మకరం మరియు ధనుస్సు వారిపై ఉంటుంది. వీరు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Solar Eclipse 2024 date: ఏప్రిల్ 08న తొలి సూర్య గ్రహణం.. ఈ 5 రాశులవారు ధనవంతులు అవ్వడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter