Solar Eclipse 2024 date: ఏప్రిల్ 08న తొలి సూర్య గ్రహణం.. ఈ 5 రాశులవారు ధనవంతులు అవ్వడం ఖాయం..
Solar Eclipse 2024: సాధారణంగా గ్రహణాలను మనం చెడుగా భావిస్తాం. అయితే ఈ గ్రహణాల వల్ల కొన్నిసార్లు మంచి కూడా జరుగుతోంది. ఈ ఏడాది సంభవించబోయే తొలి సూర్యగ్రహణం వల్ల ఏయే రాశులవారు బెనిపిట్స్ పొందబోతున్నారో తెలుసుకుందాం.
Surya Grahan 2024 effect on Zodiac Signs: సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు సంభవించబోతున్నాయి. 2024 తొలి చంద్రగ్రహణం మార్చి 25న, మెుదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 08న ఏర్పడబోతున్నాయి. అయితే ఈ రెండు గ్రహణాలు కూడా మన దేశంలో కనిపించవు. దాంతో సూతక్ కాలం కూడా చెల్లవు. ఏప్రిల్ లో సంభవించబోతున్న సూర్యగ్రహణం వల్ల ఏయే రాశుల వారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
కన్య: ఏప్రిల్ 8న సంభవించబోయే సూర్యగ్రహణం కన్యా రాశి వారికి బంఫర్ బెనిఫిట్స్ ను అందించబోతుంది. మీరు కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. జాబ్ చేసేవారికి పదోన్నతి లభిస్తుంది.
ధనుస్సు: ఆఫీసులో మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు నలు దిక్కులకు వ్యాపిస్తాయి. మీ దాంపత్య జీవితంబాగుంటుంది. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. .
మేషం: సూర్యగ్రహణం వల్ల మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏదైనా కారు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Mars transit 2024: మకరరాశిలో ధనశక్తి రాజయోగం.. ఇక ఈ 3 రాశులకు మహార్దశే...
మిథునం : సోలార్ ఎక్లిప్స్ వల్ల మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్తను వింటారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు.
సింహం : సింహ రాశి వారికి సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. నలుగురిలో మీరు గౌరవాన్ని పొందుతారు. ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Rasi Phalalu: ఫిబ్రవరి రెండ వారం ఈ రాశులవారిదే పై చేయి..ఇక ధనమే ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter