Janmashtami 2024: జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాల కదలికలు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలంలో రాశిని మార్చడం వల్ల, ఆ రాశి, రాశిచక్రంలోని ఇతర రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఆగస్టు 26న జన్మాష్టమి పండుగ రోజున కుజ గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించడం గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిషశాస్త్రంలో కుజుడిని శక్తి, ధైర్యం, విజయం, సాహసం, భూమి, ఆస్తి మొదలైన అంశాలకు చిహ్నంగా భావిస్తారు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి ఆరోగ్యం, ధైర్యం, విజయం లభిస్తాయని నమ్ముతారు. జ్యోతిషనిపుణుల ప్రకారం జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు అద్భుతమైన లాభాలు, వీపరీతమైన ధన లాభం కలుగుతుందని చెబుతున్నారు. అయితే జన్నాష్టమి రోజూ కుజుడి సంచారం వల్ల రాశుల వారిపై ఎలా ప్రభావం ఉంటుంది? ఏ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. 


మేష రాశి:


మేష రాశి వారికి కుజు గ్రహా సంచారం కారణంగా అనేక శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రానిపుణులు చెబుతున్నారు. విద్యార్థలకు ఇది శుభకాలం. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధనలాభం అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి పేరు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు.  శత్రువులపై విజయం సాధిస్తారు.  అంతేకాకుండా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.  ఎలాంటి కోరికలైన నెరవేరుతాయి. 


సింహం రాశి: 


 సింహం రాశి వారికి ఇది ఎంతో అమూల్యమైన సమయం. కుజ గ్రహా సంచారం కారణంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యలో ఆగిపోయిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు వృత్తి, ఉద్యోగాలలో మంచి పేరును పొందుతారు. అతిగా ఎవరిని నమ్మకుండా ఉండాలి. ఇష్ట దైవారాధన చేయడం వల్ల అన్నింటా విజయాలు సాధిస్తారు. ధనలాభం పొందే అవకాశం ఉంది.



కన్యా రాశి: 


కన్యా రాశి జాతకులకు కుజ ప్రభావం వల్ల అనుకూల వాతారవణం ఉంటుంది. ఆర్థికం, ఆరోగ్యంగా ఉంటారు. ఈ గ్రహా ప్రభావతంలో ఉద్యోగంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. అందరిని ఆకర్షించే విధంగా ఉంటారు. మిమ్మల్ని చూసి ఓర్వలేనివారు ఉంటారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. మీ ధైర్యం మిమ్మిల్ని కాపాడుతుంది. ఇష్టదైవారాధన చేయడం వల్ల మరి కొన్ని అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. పైన చెప్పిన విషయాలకు Zee Telugu News ఎలాంటి బాధ్యత వహించదు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి